Site icon HashtagU Telugu

Data Leak: దేశ చరిత్రలో డేటా లీక్ కలకలం, అమ్మకానికి 81.5 కోట్ల మంది ఆధార్

Ransomware Attack

Data Leak: ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోసారి నిజమని నిరూపణ అయింది. ఇప్పుడు దేశంలోనే అత్యంత భారీ డేటా చోరీకి గురైనట్లు తెలిసింది. 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ సమాచారం డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచారు. ICMR వద్ద ఉన్న 81.5 కోట్ల మంది భారతీయుల డేటా డార్క్‌ వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంచారు. ఇందులో ఆధార్‌, పాస్‌పోర్టు వివరాలతో పాటు పేరు.. ఫోన్‌ నెంబర్, అడ్రెస్‌ వంటి ఇంపార్టెంట్‌ సమాచారం మొత్తం హ్యాకర్లు ‘బ్రీచ్‌ ఫోరమ్స్‌’పై పోస్టు చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్‌ వివరాల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆధార్‌ డేటా చోరీ అంశాన్ని అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ, నిఘా విభాగం ‘రీసెక్యూరిటీ’ సంస్థ ముందుగా బయటపెట్టింది. అక్టోబర్ 9న PWN0001 అనే మారుపేరుతో పిలిచే ఒక వ్యక్తి 81.5 కోట్ల మంది భారతీయ పౌరుల ఆధార్, ఆధార్ వివరాలను ఉల్లంఘన ఫోరమ్‌లో పోస్ట్ చేసినట్లు రీ సెక్యూరిటీ సంస్థ తెలిపింది.

అంతేకాదు.. సదురు వ్యక్తి డాటా తమ వద్ద ఉందన్న దానికి రుజువుగా నాలుగు శాంపిల్స్‌ను కూడా బయటపెట్టారు. ఒక్కో శాంపిల్‌లో లక్ష మందికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో.. భారతీయుల వ్యక్తిగత డేటా చోరీకి గురైందన్న వార్తలు సంచలనంగా మారాయి. దేశవ్యాప్తగా ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సిందే మరి.

Also Read: Harish Rao: ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు విపక్షాలు అల్లర్లు సృష్టిస్తున్నాయి: మంత్రి హరీశ్ రావు