Site icon HashtagU Telugu

Dangerous Bacteria : ప్రాణాంతక బ్యాక్టీరియా వెలుగులోకి.. మరణాల రేటు 50% 

Dangerous Bacteria

Dangerous Bacteria

Dangerous Bacteria : మరో ప్రాణాంతక బ్యాక్టీరియా.. బర్ఖోల్డెరియా సూడోమల్లీని  శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని మరణాల రేటు 50 శాతం.  అంటే ఈ బ్యాక్టీరియా సోకే ప్రతి ప్రతి 100 మందిలో 50 మందికి మరణాల ముప్పు(Dangerous Bacteria) ఉంటుంది. అమెరికాలోని మిసిసిప్పి కౌంటీలో ఈ బ్యాక్టీరియా వల్ల సోకిన 3 కేసులను అమెరికా ఆరోగ్య విభాగం అధికారులు గుర్తించారు. అయితే ఆ ముగ్గురు కూడా చికిత్స తర్వాత కోలుకున్నారు. 2020 మే- జూలై టైంలోనూ మిసిసిప్పి కౌంటీలో ఇదే బ్యాక్టీరియాతో ముడిపడిన రెండు కేసులను గుర్తించారు. 

Also read : Chicken: చికెన్ తినేవారికి అలర్ట్.. అతిపెద్ద వ్యాధికి కారణమవుతున్న కోడి మాంసం..!

బర్ఖోల్డెరియా సూడోమల్లీ బ్యాక్టీరియా మట్టిలో సహజంగా నివసించే పర్యావరణ జీవి. ఇది మంచినీటిలో నివసిస్తుంది. ఎక్కువగా ఉప ఉష్ణమండల, ఉష్ణమండల వాతావరణాల్లో ఈ బ్యాక్టీరియా జీవిస్తుంది. ఇది సోకితే లక్షణాలు బయటికి కనిపించవు. దానికి వ్యతిరేకంగా మానవ రోగ నిరోధక వ్యవస్థ తగిన  ప్రతిరోధకాలను రిలీజ్ చేయదు. ఇన్ఫెక్షన్ లక్షణాలు బయటకు అది ఈజీగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.   

Also read : Powassan Virus: పోవాసాన్ వైరస్‌తో యూఎస్‌లో ఒకరు మృతి.. ఈ ప్రాణాంతకమైన వైరస్‌ లక్షణాలు, చికిత్స వివరాలివే..!

బర్ఖోల్డెరియా సూడోమల్లీ బ్యాక్టీరియా వల్ల విట్‌మోర్స్ (మెలియోయిడోసిస్) అనే వ్యాధి కూడా వస్తుంది. ఇది మనుషులతో పాటు జంతువులకూ సోకుతుంది. బహిరంగ గాయాల ద్వారా లేదా .. బలమైన తుఫాను సమయంలో సూక్ష్మక్రిములను పీల్చడం ద్వారా ఈ బ్యాక్టీరియా బారిన పడతారు. షుగర్, కిడ్నీ వ్యాధులు ఉన్నవారికి దీని రిస్క్ ఎక్కువ. విట్‌మోర్స్ లక్షణాలలో వాపు, జ్వరం, దగ్గు, ఛాతీ నొప్పి, అధిక జ్వరం, తలనొప్పి, పొత్తికడుపులో అసౌకర్యం, కీళ్ల నొప్పులు, మూర్ఛ ఉన్నాయి.