Cyclone Michaung: మైచాంగ్ తుపాను ఎఫెక్ట్.. ఏపీలోని పలు జిల్లాల పరిస్థితి ఎలా ఉందంటే..?

తీవ్రతుఫాను మైచాంగ్ (Cyclone Michaung) నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో ఉంది. మధ్యాహ్నం లోపు బాపట్ల దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.

Published By: HashtagU Telugu Desk
Michaung Cyclone

Michaung Cyclone Effect 100

Cyclone Michaung: తీవ్రతుఫాను మైచాంగ్ (Cyclone Michaung) నెల్లూరుకు 80 కి.మీ, బాపట్లకు 80 కి.మీ, మచిలీపట్నానికి 140కి.మీ. దూరంలో ఉంది. మధ్యాహ్నం లోపు బాపట్ల దగ్గరలో తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. తీరం వెంబడి గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..!

తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చింది. అక్కడి తుపాను రక్షిత భవనంలో స్థానిక గిరిజనులకు పునరావాసం కల్పించారు. వర్షం, గాలుల తీవ్రతకు సూర్యలంక బీచ్ పోలీస్ అవుట్ పోస్ట్ కూలిపోయే స్థితిలో ఉంది. తీరప్రాంతంలోని 25 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపత్తును ఎదుర్కొనేందుకు 16 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధం చేసిన అధికారులు.

Also Read: CM Jagan : డిసెంబర్ 18 నుండి ఏపీలో కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణి

పశ్చిమగోదావరి జిల్లాకు రెడ్ ఎలర్ట్, ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. నర్సాపురం, మొగల్తూరు రెండు మండలాల్లో 12 తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు గుర్తించారు. పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. భీమవరం కలెక్టర్ కార్యాలయంలో ‘మిచాంగ్’ తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవస సహాయం కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08816 299219ను సంప్రదించాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను అధికారులు సిద్ధంగా ఉంచారు.

మిచౌంగ్ తుపాను ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు. ఈమేరకు విశాఖ నుంచి 23 విమానాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అంతకముందు విమానాశ్రయం పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లో ఉంచుతున్నాం. అత్యవసర సర్వీసులు, మళ్లింపు కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుంది. రన్‌వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 వరకే విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతి ఇస్తున్నాం అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తుఫాను కారణంగా కృష్ణాజిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుండి మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణాజిల్లాలో రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ఇప్పటివరకు కోసిన పంటను మిల్లులకు, రైతు భరోసా కేంద్రాలకు, సురక్షితమైన ప్రాంతాలకు తరలించారు.

  Last Updated: 05 Dec 2023, 12:19 PM IST