Site icon HashtagU Telugu

Cyclone Biparjoy: ‘బిపార్జోయ్’ తుఫాను అప్ డేట్.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే..?

Cyclone Biparjoy

Cyclone Mandous

Cyclone Biparjoy: సైక్లోనిక్ తుఫాను ‘బిపార్జోయ్’ (Cyclone Biparjoy) గుజరాత్‌లోని కచ్, సౌరాష్ట్రను తాకిన తర్వాత కొంత బలహీనపడింది. గుజరాత్ తీర ప్రాంతాలకు చేరుకున్న కొన్ని గంటల తర్వాత బిపార్జోయ్ తీవ్రత ‘చాలా తీవ్రమైన’ నుండి ‘తీవ్రమైన’ వర్గానికి తగ్గింది. దీంతో పాటు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. బలహీనపడిన తర్వాత ఈ తుఫాను దక్షిణ రాజస్థాన్ వైపు కదిలింది. తుపాను కారణంగా గుజరాత్‌లోని వెయ్యి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం, రోడ్లపై కూలిన చెట్లను తొలగించడం రాష్ట్ర ప్రభుత్వం ముందున్న తక్షణ సవాలు.

ఉత్తర గుజరాత్‌లో భారీ వర్ష సూచన

ఉత్తర గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందస్తు ప్రణాళికతో లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ఎవరూ చనిపోలేదని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. కచ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, మోర్బీ, జునాగఢ్, గిర్ సోమనాథ్, రాజ్‌కోట్, పోర్‌బందర్ జిల్లాల్లో 1,127 బృందాలు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు పనిచేస్తున్నాయని తెలిపింది. అదే సమయంలో రోడ్లపై పడిన 581 చెట్లను అటవీశాఖ తొలగించింది.

బిపార్జోయ్ వల్ల ఎవరూ చనిపోలేదు: రాష్ట్ర రిలీఫ్ కమిషనర్

అంతకుముందు రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. బిపార్జోయ్ తుఫాను కారణంగా రాష్ట్రంలో ఏ వ్యక్తి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఇది రాష్ట్రం సాధించిన అతిపెద్ద విజయం. మా సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించిన 1,09,000 మందిలో 10,918 మంది చిన్నారులు, 5,070 మంది సీనియర్ సిటిజన్లు, 1,152 మంది గర్భిణులు ఉన్నారని పత్రికా ప్రకటన తెలిపింది. గుజరాత్‌లోని కచ్‌, సౌరాష్ట్ర ప్రాంతాల్లో ‘బిపార్జోయ్’ కారణంగా ఈదురు గాలులు, భారీ వర్షాల కారణంగా వందలాది విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి.

Also Read: Tamil Nadu: త‌మిళ‌నాడులో సీఎం స్టాలిన్, గ‌వ‌ర్న‌ర్‌ మ‌ధ్య మ‌రోసారి వివాదం.. ఈసారి ఏం జ‌రిగిందంటే..

గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు

తుఫాను జఖౌ నౌకాశ్రయానికి చేరుకునే ప్రక్రియ గురువారం (జూన్ 15) సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున 2:30 వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. తుపాను కారణంగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు భారీ వర్షం కురవడంతో పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సముద్రపు నీరు లోతట్టు గ్రామాలను ముంచెత్తింది.

విద్యుత్‌ సంస్థకు భారీ నష్టం

తుపాను కారణంగా గుజరాత్‌కు చెందిన పవర్ కంపెనీ ‘పశ్చిమ్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్’ భారీగా నష్టపోయిందని, 5,120 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ తెలిపారు. కనీసం 4,600 గ్రామాలకు కరెంటు లేదని, అయితే 3,580 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు.