CP CV Anand : పెరుగుతున్న టెక్నాలజీ ప్రపంచంలో మంచితో పాటు చెడు కూడా పెరుగుతోంది. టెక్నాలజీని సైబర్ కేటుగాళ్లు తమకు నచ్చినట్లు వాడుతున్నారు. ఈక్రమంలోనే సైబర్ నేరస్థులు డిజిటల్ అరెస్టుల పేరిట ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేస్తున్నారు. వారు పోలీసు శాఖ అధికారుల ఫోటోలను తమ డీపీగా ఉపయోగించి వాట్సాప్ ద్వారా కాల్స్ చేస్తూ, ప్రజలను భయపెడుతున్నారు. ఈ కొత్త సైబర్ మోసం లో, పలువురు హైదరాబాద్ నివాసితులకు నగర పోలీసు కమిషనర్ (సీపీ) సీవీ ఆనంద్ యొక్క ఫోటో డీపీగా పెట్టిన వాట్సాప్ నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి. సీపీ ఆనంద్ ఫోటో డీపీగా కనిపించడం వల్ల ప్రజలు గందరగోళం చెందారు. ఈ కాల్స్ అనుమానాస్పదంగా ఉండడంతో కొందరు వాటిని తేల్చేందుకు సైబర్ క్రైమ్ విభాగానికి, అలాగే సీపీకు సమాచారాన్ని అందించారు.
H Pylori Infection : అమ్మ చేతి గోరు ముద్దతో హెచ్. పైలోరీ బ్యాక్టీరియా వ్యాప్తి.. ఏమిటిది ?
సీపీ సీవీ ఆనంద్ ఈ అంశంపై వెంటనే స్పందించారు. ఆయన ప్రజలను అప్రమత్తం చేస్తూ, “పోలీసు అధికారుల ఫోటోను ఉపయోగించి ఎవరో కొంతమంది ప్రజలకు కాల్స్ చేస్తుంటే, దానిని పట్టించుకోకండి. ఈ రకమైన కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు.” ప్రజల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ కాల్స్ పాకిస్థాన్ కంట్రీ కోడ్ (+92) తో ప్రారంభమవుతుండడం గమనార్హం. అయితే, భారతదేశ ఫోన్ నెంబర్లు ఎప్పుడూ +91 కోడ్ తో మొదలవుతాయి. అందువల్ల, సీపీ ఆనంద్ పోలీసు అధికారులు నోటిఫై చేసినట్లుగా, ఈ రకమైన ఫోన్ కాల్స్ వస్తే, వాటిని ప్రతిస్పందించకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930, డయల్ 100/122 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులు సంప్రదించవచ్చు.
Beauty Tips: చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వేపాకుతో ఇలా చేయాల్సిందే!
ప్రజలకు సూచన:
- ఈ విధమైన అనుమానాస్పద కాల్స్ వచ్చినా వాటిని పట్టించుకోకండి.
- ఏమైనా అనుమానాలు వస్తే, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా డయల్ 100/122 నంబర్లను డయల్ చేయాలని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
- పోలీసుల పేరుతో ఎవరో రాష్ట్రమంతటా కాల్స్ చేస్తే, ఎవరూ స్పందించకూడదని ఆయన సూచించారు.
- ఈ విధమైన సైబర్ మోసాలకు గురవకుండా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ నొక్కి చెప్పింది.