Site icon HashtagU Telugu

CUET PG 2023: CUET PG రిజిస్ట్రేషన్ గడువు పెంపు.. మే 5 వరకు ఛాన్స్.. దరఖాస్తు చేసే విధానం ఇదే..!

CUET PG 2023

Resizeimagesize (1280 X 720) (1)

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET- PG 2023) రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీని పొడిగించనున్నట్లు యుజిసి ఛైర్మన్ జగదీష్ కుమార్ తెలిపారు. ఆయన ప్రకారం.. దరఖాస్తు తేదీని మే 5 వరకు రాత్రి 9.50 వరకు పొడిగించారు. అభ్యర్థులు cuet.nta.nic.inని సందర్శించడం ద్వారా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో దిద్దుబాట్లు మే 6 నుండి మే 8 వరకు చేయవచ్చు. అడ్మిట్ కార్డ్, ఫలితాల కోసం సమాచారం త్వరలో వెబ్‌సైట్‌లో ఉంచబడుతుందని ఆయన పేర్కొన్నారు.

CUET PG 2023 దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర, డీమ్డ్, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి జూన్ 1 నుండి జూన్ 10 వరకు నిర్వహించబడుతుంది. CUET PG 2023 కోసం నమోదు చేసుకోవడానికి చివరి తేదీ మే 5 అయితే, ఎడిట్ కు మే 6 నుండి మే 8 వరకు అవకాశం ఇచ్చింది. CUET PG 2023 అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకునే తేదీ, ఫలితాల ప్రకటన CUET PG పోర్టల్‌లో ప్రకటించబడుతుంది. రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించాలని పలు యూనివర్సిటీలు డిమాండ్ చేశాయని యూజీసీ చైర్మన్ తెలిపారు. బ్యాచిలర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు CUET PG పరీక్ష రాయవచ్చు.

Also Read: Black Pepper Benefits : పొద్దున్నే లేవగానే నల్ల మిరియాలు తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

CUET PG 2023 దరఖాస్తు నమోదు ప్రక్రియ

– CUET- cuet.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

– పేరు, లింగం, సంప్రదింపు నంబర్ మొదలైన వ్యక్తిగత వివరాలను పూర్తి చేయండి.

– CUET PG 2023 దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.

– ఫోటో, సంతకం, కుల ధృవీకరణ మొదలైన వాటితో సహా స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

– దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.

– CUET 2023 PG దరఖాస్తును సమర్పించండి.

– నిర్ధారణ పేజీని సేవ్ చేసి, సబ్మిట్ కొట్టండి. ప్రింట్ తీసుకోండి.