UK Recognised Crypto : క్రిప్టో కరెన్సీకి యూకే ఆమోదం.. కొత్త చట్టానికి కింగ్ గ్రీన్ సిగ్నల్

UK Recognised Crypto : యునైటెడ్ కింగ్ డమ్ (UK) కీలక నిర్ణయం తీసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Uk Recognised Crypto 

Uk Recognised Crypto 

UK Recognised Crypto : యునైటెడ్ కింగ్ డమ్ (UK) కీలక నిర్ణయం తీసుకుంది.  క్రిప్టో కరెన్సీల అధికారిక వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అవి యూకే ఆర్థిక వ్యవస్థలో అధికారిక భాగమయ్యాయి. దీనికి సంబంధించి యూకే ప్రభుత్వం రూపొందించిన “ఫైనాన్షియల్  సర్వీసెస్ అండ్ మార్కెట్స్ యాక్ట్ 2023″కి కింగ్ చార్లెస్ ఆమోదం తెలిపారు. దీనిపై UK ప్రభుత్వం నుంచి అధికారిక పత్రికా ప్రకటన వెలువడింది.

కొత్త చట్టంలో ఏముంది ?

“ఫైనాన్షియల్  సర్వీసెస్ అండ్ మార్కెట్స్ యాక్ట్ 2023”  ప్రకారం..  క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ అనేది యూకేలో ప్రభుత్వ నియంత్రిత ఆర్థిక కార్యకలాపంగా(UK Recognised Crypto) గుర్తించబడింది. సవరించిన ఆర్థిక సేవలు, మార్కెట్ల చట్టంలో క్రిప్టో ఆస్తులను నియంత్రిత ఆర్థిక సాధనాలు, ఉత్పత్తులు, పెట్టుబడులుగా పరిగణించారు. ఆర్థిక సేవలలోనూ క్రిప్టోకరెన్సీ తో ముడిపడిన కొత్త సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని యూకే సర్కారు  ప్రోత్సహిస్తుంది. సేఫ్ గా క్రిప్టోకరెన్సీ లావాదేవీలను నిర్వహించేందుకు వీలుగా ‘శాండ్‌బాక్స్’ అనే ప్రత్యేక స్క్రీనింగ్ వ్యవస్థలను బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

Also read : Bedroom politics : ఏపీ రాజ‌కీయాల్లో బెడ్ రూమ్ మ‌సాలా! YSR రెండోకాపురంపై జ‌న‌సేన వీడియో

సంక్షోభంలో ఉన్న యూకే ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రధానమంత్రి రిషి సునాక్ నేతృత్వంలోని  యూకే  ప్రభుత్వం భావిస్తోంది. క్రిప్టో హబ్‌లుగా తమను తాము స్థాపించుకోవాలని చూస్తున్న హాంకాంగ్, నైజీరియా, యూఏఈ వంటి ఇతర ప్రో-క్రిప్టో దేశాలతో ఇకపై UK కూడా పోటీ పడనుంది.  2022లో క్రిప్టో సంబంధిత ఉపాధి అవకాశాలు  82,200 మార్కును తాకాయి.  ఈ సంఖ్య 2019లో 18,200 మాత్రమే. అంటే గత మూడేళ్ళలో క్రిప్టో సంబంధిత ఉపాధి అవకాశాలు సుమారు 351 శాతం పెరిగాయి.

  Last Updated: 01 Jul 2023, 02:39 PM IST