IPL 2023: పాపం జడ్డూ భాయ్ కి ఎంత కష్టమో.. ధోని ఫాన్స్ టూమచ్

ఒకప్పుడు సచిన్ ఫాన్స్ ద్రావిడ్ అవుట్ అయితే బాగుండు అని కోరుకునేవారు. ఎందుకంటే ద్రావిడ్ అవుట్ అయితే నెక్స్ట్ తమ అభిమాన క్రికెటర్ సచిన్ మైదానంలోకి వస్తాడని.

IPL 2023: ఒకప్పుడు సచిన్ ఫాన్స్ ద్రావిడ్ అవుట్ అయితే బాగుండు అని కోరుకునేవారు. ఎందుకంటే ద్రావిడ్ అవుట్ అయితే నెక్స్ట్ తమ అభిమాన క్రికెటర్ సచిన్ మైదానంలోకి వస్తాడని. ఒక టైం లో ద్రావిడ్ ఇదే విషయాన్ని చెప్పాడు. అయితే అది గతం. ఇప్పుడు జడేజా అవుట్ అయితే బాగుండు అని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులే కోరుకుంటున్నారు. తాజాగా జడేజా ఇదే విషయాన్ని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

క్రికెట్ ఫార్మేట్ ఏదైనా మోస్ట్ వాంటెడ్ ప్లేయర్ గా అభిమానులు గుండెల్లో నిలిచిపోయాడు జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోని. మాకు ధోని ఉంటె చాలు మరే ప్లేయర్ అవసరం లేదనే స్థాయికి ధోని చేరుకున్నాడు. ఐపీఎల్ లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది చెన్నై ప్రదర్శన ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అందరి కళ్ళు ధోనీపైనే. ఇక తాజాగా ధోని మానియా ఏంటో మరోసారి రుజువైంది. రవీంద్ర జడేజా చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. జడేజా ధోని ఫాన్స్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

బుధవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా బ్రాడ్‌కాస్టర్ జియోతో మాట్లాడారు. మీరు ఏ ఆర్డర్ లో బ్యాటింగ్ కు రావాలి అనుకుంటున్నారని జియో ప్రశ్నించగా… జడేజా మాట్లాడుతూ… బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వస్తే.. నేను అవుట్ కావాలని చెన్నై ఫ్యాన్సే కోరుకుంటున్నారు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చినా నేను అవుట్ కావాలనే అనుకుంటున్నారు. ఎందుకంటే నేను అవుట్ అయితే ధోని వస్తాడని వాళ్ళ ఆశ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే చెన్నై జట్టు గెలిచినంతకాలం నేను హ్యాపీయే అంటూ కామెంట్ చేశాడు రవీంద్ర జడేజా.

ఐపీఎల్ 2023లో జడేజా సత్తా చాటుతున్నాడు. బ్యాటింగ్ లో సోసో పెర్ఫార్మెన్స్ చేసినప్పటికీ బంతితో మాయ చేస్తున్నాడు. ఈ సీజన్లో రవీంద్ర జడేజా 12 మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టి ,బ్యాటింగ్‌లో 18.83 సగటుతో 113 పరుగులు చేశాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ జరిగిన మ్యాచ్ లో 16 బంతుల్లో 21 పరుగులు సాధించి, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో జడ్డూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Read More: Virat Kohli: కోహ్లీ కెరీర్‌కు 15 ఏళ్లు.. గురువును గుర్తు చేసుకుంటూ ఎమోషనల్