ప్రస్తుతం సమాజంలో చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు (Commits Suicide) చేసుకునే ఘటనలు పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో విఫలం కావడం, ప్రేమలో నిరాశకు గురికావడం, తల్లిదండ్రుల మందలింపు వంటి కారణాలతో యువత తడబాటుకు గురవుతున్నారు. మానసిక స్థైర్యాన్ని కోల్పోయి క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఆ కుటుంబాలను శోకసంద్రంలో ముంచేస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాలో పెద్దలు తమ ప్రేమను అంగీకరించరేమోననే భయంతో ఒక యువ జంట ఆత్మహత్య (Commits Suicide) చేసుకోవడం ఆవేదన కలిగిస్తుంది.
Harish Rao : హరీష్ రావు పిల్లకాకి- సీఎం రేవంత్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన గోలేటి శ్వేత, కరీంనగర్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇల్లందకుంట మండలానికి చెందిన రాహుల్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కానీ శ్వేత రాహుల్ కన్నా పెద్దదిగా ఉండడం, వారి భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలు, కుటుంబ సభ్యులు అంగీకరించరేమోనన్న భయం వారిని ఆత్మహత్య వైపు నిర్ణయం తీసుకునేలా చేసింది. చివరికి జమ్మికుంట మండలంలోని రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరూ కలిసి ప్రాణాలు తీసుకున్నారు.
Sunita Williams Salary: 9 నెలలుగా స్పేస్‌లోనే సునిత.. ఎక్స్‌ట్రా శాలరీ ఎంత ?
ఇలాంటి ఘటనలు ఆలోచనలో పడేలా చేస్తాయి. చిన్న సమస్యలకే జీవితాన్ని ముగించేయడం క్షణికావేశ నిర్ణయం. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు సమర్థంగా మద్దతుగా ఉంటే, యువతను ఈ విధంగా దారుణ నిర్ణయాలకు దూరంగా ఉంచవచ్చు. యువత మానసికంగా బలంగా ఉండేందుకు కౌన్సెలింగ్, అవగాహన కార్యక్రమాలు చాలా అవసరం. ప్రేమ, జీవితం, భవిష్యత్తు వంటి విషయాలపై యువత ఆలోచనాత్మకంగా ముందుకెళ్లాలి అని అంత చెపుతున్నారు.