భారత్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్న కరోనా మూడో వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజు దేశవ్యాప్తంగా రోజుకు లక్షకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే గత 24గంటల్లో 11,56,363 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 83, 876 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక కరోనా కారణంగా 895 మంది ప్రాణాలు కోల్పోగా, 1,99, 054 మంది కరోనా నుండి కోలుకున్నారు.
ఇక దాదాపు నెల రోజుల తర్వాత లక్షకు దిగువున కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో దేశ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో 11,08,938 కరోనా యాక్టీవ్ కేసులు ఉండగా, 4,06,60,202 మంది కరోనా రోగులు రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు భారత్‌లో 5,41,53,712 మంది కరోనా బారిన పడ్డట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెళ్ళడించింది. అలాగే ఇప్పటి వరకు ఇండియాలో 1,69,63,80,755 కరోనా వ్యాక్సినేషన్ జరిగింది.