Site icon HashtagU Telugu

Congress Worker Killed: కాంగ్రెస్ నేత హత్య… ఉద్రిక్తంగా మారిన ఎలక్షన్ కమిషన్ కార్యాలయం

Congress worker killed

Cfb49f50 9d15 4700 B8df 20a649d072e5

Congress Worker Killed: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేత హత్యతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఓ నాయకుడి హత్యకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

కాంగ్రెస్ నేత హత్యపై పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్ స్పందించారు. నిన్న కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడని అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలను మోహరించాలని గవర్నర్‌ను అభ్యర్థించామని సుకాంత్ మజుందార్ తెలిపారు. ఎన్నికల విధుల్లో కాంట్రాక్టు సిబ్బందిని అనుమతించరాదని, పోలింగ్‌ కేంద్రాలతో పాటు కౌంటింగ్‌ హాళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్ నేత ఫుల్‌చంద్ షేక్ శుక్రవారం జూన్ 9న ఖర్‌గ్రామ్‌లో హత్యకు గురయ్యాడు. అతనిపై టీఎంసీ నాయకుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఫుల్‌చంద్ అక్కడిక్కడే మరణించాడు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు తొలి రోజే కాంగ్రెస్ నేత హత్యకు గురి కావడం ఉద్రిక్తతకు దారి తీసింది.

టీఎంసీ నేత అరెస్ట్:
ముర్షిదాబాద్‌లోని డోమ్‌కల్‌లో టీఎంసీ నాయకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతని నుండి పిస్టల్ స్వాధీనం చేసుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read More: Odisha Train Accident: సీబీఐ దూకుడు…ఆ రైల్వే స్టేషన్‌లో రైళ్ల నిలుపుదల నిషేధం