Site icon HashtagU Telugu

Congress – Ayodhya : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లం : కాంగ్రెస్

Congress Ayodhya

Congress Ayodhya

Congress – Ayodhya : జనవరి 22న జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తమ పార్టీ నేతలు హాజరుకాబోరని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ కార్యక్రమం బీజేపీ, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) యొక్క రాజకీయ ప్రాజెక్టులా మారిందని వ్యాఖ్యానించింది. అయోధ్య రామమందిరం ఆహ్వానం అందుకున్న తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈ కార్యక్రమానికి హాజరుకాబోరని(Congress – Ayodhya) స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

‘‘మతం అనేది వ్యక్తిగత విషయం. కానీ ఆర్ఎస్ఎస్, బీజేపీలు చాలా కాలంగా అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని రాజకీయ ప్రాజెక్టుగా తయారుచేశాయి. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కాకముందే.. బీఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ నాయకులు హడావుడిగా రామమందిరాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నది ఎన్నికల్లో లాభం పొందడం కోసమే’’ అని కాంగ్రెస్ ఆరోపించింది. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును,  శ్రీరాముడిని గౌరవించే కోట్లాది మంది మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుందని తేల్చి చెప్పింది. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరిలు ఈ కార్యక్రమానికి అందిన ఆహ్వానాలను తిరస్కరించారని హస్తం పార్టీ వెల్లడించింది. ఈమేరకు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Target 400 : విపక్షల ఎంపీలపై బీజేపీ ఆకర్ష్ మిషన్.. ‘జాయినింగ్ కమిటీ’ ఏర్పాటు

రాహుల్‌ గాంధీ జనవరి 14 నుంచి ప్రారంభించాల్సిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ యాత్రకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. మణిపూర్ పీసీసీ అధ్యక్షుడు కె.మేఘచంద్ర పార్టీ నాయకులతో కలిసి బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ను కలిశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకొని అక్కడ రాహుల్‌ యాత్రకు అనుమతి ఇవ్వలేమని ముఖ్యమంత్రి వారికి వెల్లడించారు. రాహుల్‌ యాత్రకు అనుమతుల విషయంలో తమ ప్రభుత్వం పూర్తిగా భద్రతా సంస్థల నివేదికలపైనే ఆధారపడిందని సీఎం మంగళవారం వెల్లడించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం చాలా సంక్లిష్టంగా మారిందన్నారు. ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ జనవరి 14న మొదలై మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు కొనసాగనుంది. మణిపూర్, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఈ యాత్ర జరుగుతుంది. వచ్చే ఎన్నికల కోసం పార్టీ క్యాడర్‌ను యాక్టివేట్ చేసేందుకు ఈ యాత్ర దోహదం చేస్తుందని  కాంగ్రెస్ భావిస్తోంది.