Vaddiraju: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణంలతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా విఫలమైందని, ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని, తెలంగాణలో ప్రధాన సామాజిక వర్గాలకు ప్రభుత్వంలో ప్రాతినిథ్యం, ప్రాధాన్యత ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
ముస్లిం, మున్నూరుకాపు, ముదిరాజ్, యాదవ,పద్మాశాలీ,లంబాడీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలే అని, ఎంపీ సీట్ల కేటాయింపులో మాదిగలను పట్టించుకోలే, దీంతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కాంగ్రెస్ పాలకులపై గుర్రుగా ఉన్నరని వద్దిరాజు అన్నారు. రైతుబంధు ఇవ్వకపోవడం, పింఛన్లు 4వేలకు పెంచకపోవడం,కళ్యాణలక్ష్మీతో పాటు ఇస్తామన్న తులం బంగారం మాటే ఎత్తకపోవడం, గృహిణులకు రూ500 వంటగ్యాస్,రూ2,500 సాయం, నిరుద్యోగ భృతి 4వేలు ఊసే ఎత్తకపోవడం వంటి హామీలను పాలకులు విస్మరించారని, ఈ కారణాల వల్ల రైతన్నలు,మహిళలు, యువత కాంగ్రెస్ పార్టీ పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారని వద్దిరాజు అన్నారు.
మహానేత కేసీఆర్ బస్సు యాత్రకు,రోడ్ షోలకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని, కేసీఆర్ 10ఏండ్ల పాలనను కాంగ్రెస్ 150రోజుల పనితీరును పోల్చి చూస్తున్న ప్రజలు బీఆర్ఎస్ పట్ల సానుకూలత పెంచుకుంటున్నరు, అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10ఏండ్ల అనతికాలంలోనే గొప్పగా అభివృద్ధి చేసిన కేసీఆర్ వైపు ప్రజలంతా చూస్తున్నారని వద్దిరాజు వెల్లడించారు.