Congress Support AAP : కాంగ్రెస్ కీలక నిర్ణయం.. కేంద్రం ఆర్డినెన్స్ పై ఆప్ కు మద్దతు

Congress Support AAP : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ  ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Sonia Gandhi Invite To Aap

Sonia Gandhi Invite To Aap

Congress Support AAP : ఢిల్లీ సర్కారు అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ  ప్రకటించింది.  తాము ఆ ఆర్డినెన్స్ ను సమర్ధించబోమని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  కేసీ వేణుగోపాల్ ఆదివారం ప్రకటించారు. ఢిల్లీ హక్కులను హరించేలా  కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ పై తమ వైఖరి ఇదేనని వెల్లడించారు. రేపు (సోమవారం) బెంగళూరులో జరిగే విపక్షాల మీటింగ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  హాజరవుతుందని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా  స్పందిస్తూ.. తమ  పార్టీకి కాంగ్రెస్ మద్దతును ప్రకటించడాన్ని స్వాగతించారు. కేంద్రం ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ప్రకటించడాన్ని “సానుకూల పరిణామం”గా(Congress Support AAP) అభివర్ణిస్తూ ఆయన ట్వీట్ చేశారు.

Also read : A Orphan Vs War For Adoption : అనాథ బాలుడి దత్తత కోసం క్యూ లైన్లు.. ఎందుకు ?

బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సమావేశానికి సరిగ్గా ఒక రోజు ముందు.. కేంద్రం ఆర్డినెన్స్ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి కాంగ్రెస్  పార్టీ మద్దతును ప్రకటించడం మారుతున్న రాజకీయ పరిణామాలకు సంకేతం. విపక్ష పార్టీలను ఏకం చేసే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఒక మెట్టు దిగి ఆప్ తో కలిసి నడిచేందుకు సిద్ధమవడం మంచి పరిణామమని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగే రెండో ప్రతిపక్ష సమావేశానికి 24 బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు.

  Last Updated: 16 Jul 2023, 03:52 PM IST