Site icon HashtagU Telugu

Condom Packets : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు కలకలం

Condom Packets In Girls' Sc

Condom Packets In Girls' Sc

జగిత్యాల(Jagtial) జిల్లాలోని సీఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాల(CSI Girls High School)లో కండోమ్ ప్యాకెట్లు (Condom Packets) మరియు మద్యం సీసాలు కనిపించడం తీవ్ర కలకలంగా మారింది. ఈ సంఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్‌కు దిశానిర్దేశం చేయాల్సిన స్థానాలు కాగా, ఇలాంటి సంఘటనలు షాక్ ను కలిగిస్తున్నాయి. పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోవడమే కాకుండా, విద్యార్థినులతో వాటిని శుభ్రం చేయించడం అనైతిక చర్యగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Davos Tour : మనం జాబ్ అడగడం కాదు, ఇచ్చే స్థితిలో ఉండాలి – చంద్రబాబు

పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలను చూసి విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. అయితే వాటిని శుభ్రం చేయాలనీ ఉపాధ్యాయులు విద్యార్థినులను బలవంతం చేసినట్లు తెలుస్తుంది. స్కూల్ లో అటెండర్ లేకపోవడం వల్ల విద్యార్థినులతో ఈ పని చేయిస్తున్నామని ఉపాధ్యాయులు పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. విద్యార్థులను ఇలాంటి పనులకు బలవంతపెట్టడం విద్యాసంస్థల విలువలకు విరుద్ధం అని స్థానికులు స్కూల్ యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు ఉన్నాయంటే.. ఈ విద్యాసంస్థ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని వారంతా వాపోయారు. ఈ ఘటన పై ఉన్నత అధికారులు దృష్టి పెట్టాలని, పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు కఠినమైన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.