Commonwealth Games: 2026 కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణపై సందిగ్ధత.. బడ్జెట్‌ పెరుగుదలే కారణమా..?

2026లో ఆస్ట్రేలియాలో జరగనున్న కామన్‌వెల్త్‌ క్రీడల (Commonwealth Games) నిర్వహణపై సందిగ్ధత నెలకొంది.

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 10:05 AM IST

Commonwealth Games: 2026లో ఆస్ట్రేలియాలో జరగనున్న కామన్‌వెల్త్‌ క్రీడల (Commonwealth Games) నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. బడ్జెట్‌లో పెరుగుదల కారణంగా విక్టోరియా ప్రభుత్వం ఇప్పుడు ఈ గేమ్‌లను నిర్వహించడానికి నిరాకరించింది. జులై 18న అక్కడి ప్రభుత్వం ఇచ్చిన సమాచారంలో ఈ క్రీడల నిర్వహణకు బడ్జెట్‌ రెట్టింపు కావడం వల్ల పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోతున్నామని తెలిపారు.

కామన్వెల్త్ గేమ్స్ 2026లో 20కి పైగా ఈవెంట్‌లు నిర్వహించాల్సి ఉంది. ఇందులో 5 వేలకు పైగా అథ్లెట్లు పాల్గొంటారు. విక్టోరియా ప్రీమియర్ డేనియల్ ఆండ్రూస్ ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా గత సంవత్సరం మమ్మల్ని సంప్రదించినట్లు తన నిర్ణయం గురించి విలేకరుల సమావేశంలో తెలియజేశారు.

గత సంవత్సరం మేము దీనిని హోస్ట్ చేసినప్పుడు ఆ సమయంలో ఈ క్రీడల నిర్వహణకు సుమారు రూ. 15,000 కోట్లు అంచనా వేయగా, మేము దాని కోసం సిద్ధం చేయడం కోసం ప్రారంభించాం. ఇప్పుడు ప్రస్తుత వ్యయం రూ. 34,000 కోట్లకు పెరిగిందని ప్రీమియర్ చెప్పారు. అందువల్ల, దీనిని నిర్వహించకూడదని నిర్ణయం తీసుకొని, మేము ఈ నిర్ణయం గురించి ఫెడరేషన్‌కు కూడా తెలియజేసాము. ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నాం. స్కూల్, హాస్పిటల్ డబ్బు తగ్గించి ఆర్గనైజ్ చేయలేం అని తెలిపారు.

Also Read: Wicket-Keeper: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా వికెట్ కీపర్ ఎవరో..? అందరి చూపు ఈ ఆటగాళ్ల పైనే..!

నిర్ణయంపై ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది

ఇప్పటి వరకు 5 సార్లు కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఆస్ట్రేలియాపై కామన్వెల్త్ ఫెడరేషన్ కూడా నిరాశను వ్యక్తం చేసింది. విక్టోరియా ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి, ఈ నిర్ణయం తీసుకునే ముందు వారు మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఫెడరేషన్ తెలిపింది. జూన్‌లో జరిగిన సమావేశంలో బడ్జెట్‌ రూ.15 వేల కోట్లు కాగా, ఇప్పుడు రెట్టింపుగా చెబుతున్నారు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.