హైదరాబాద్ బిర్యానీ (Hyderabad Biryani) తింటున్నారా.. అయితే జర జాగ్రత్త. సిటీలోని అమీర్‌పేట్‌లోని కెప్టెన్ కుక్ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక పడిన ఘటన వెలుగుచూసింది. దీంతో కస్టమర్ కు పరిహారంగా (Fine) రూ.20,000 చెల్లించాల్సి వచ్చింది. రెస్టారెంట్ మేనేజర్‌పై ఒక ఎం అరుణ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏప్రిల్ 18న జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
సెప్టెంబరు 2021లో, అరుణ్ రెస్టారెంట్ నుండి చికెన్ బిర్యానీ (Hyderabad Biryani) పార్శిల్‌ను ఆర్డర్ చేశాడు. బిర్యానీ తింటుండగా ఓ పురుగు పాకడంతో చూసేసరికి బొద్దింక (cockroach) బయటపడింది. దీంతో కస్టమర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఇదే విషయాన్ని వీడియో తీసి రెస్టారెంట్‌కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో ఓనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు సమాచారం. భవిష్యత్తులో తాను ఈ స్థలం నుండి ఏమీ ఆర్డర్ చేయనని, రెస్టారెంట్ మేనేజర్ అతనికి రూ. 240 మొత్తాన్ని తిరిగి చెల్లించాడని అతను చెప్పాడు. అరుణ్ ఈ విషయాన్ని జిల్లా ఫోరమ్‌కు తీసుకెళ్లాడు. వివరాలు విన్న తర్వాత, కమిషన్ రెస్టారెంట్ యజమానులను (Owner) దోషులుగా గుర్తించి 20 వేలు చెల్లించాలని ఆదేశించింది.
Also Read: Mahesh Babu Remuneration: భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన మహేశ్, ఒక్క సినిమాకు అన్ని కోట్లా!