CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు కవాతు అనంతరం, ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ అందజేశారు.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేది మా ఆలోచన అని, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని, రాష్ట్రంలో సన్నధాన్యం దిగుబడి పెరిగి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు దళారుల బారిన పడకుండా చేశామని రేవంత్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా.. భూభారతితో భూములకు రక్షణ కల్పిస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ వెల్లడించారు. 8 నెలల్లో 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేశామని, భూమిలేని వ్యవసాయ రైతు కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. డీఎస్సీ ప్రకటించి 10 వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని, ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
CM Chandrababu : తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలి
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, 27 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నిర్మిస్తున్నామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. శాస్త్రీయంగా కులగణన నిర్వహించి బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చామని, తెలంగాణ బాటలోనే కేంద్రం కూడా జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైందని సీఎం రేవంత్ రెడ్డి
ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై మా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, మే 20 నాటికి 5,364 మంది లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమచేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాల చరిత్రలో సన్నబియ్యం ఒక ట్రెండ్ సెట్టర్.. ఇప్పటివరకు 3 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపడుతున్నామని, 30 వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ కోసం ప్రణాళిక రచించుకున్నామన్నారు రేవంత్ రెడ్డి. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ చారిత్రక, టూరిజం ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేశాం.. తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Heavy Rains : ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. కొండచరియలకు 34 మంది బలి