CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చిరుకూరు గురుకుల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో విద్యాప్రమాణాలు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివితే రాణిస్తారని ఒక అపోహ ఉండేది. కానీ ఆ అపోహను తొలగించి.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా రాణిస్తారని నిరూపించాలి. ఇప్పటికే పలువురు నిరూపించారు. గురుకులాల్లో మల్టీ టాలెంటేడ్ విద్యార్థులున్నారని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం అందిస్తామని తెలిపారు.
గురుకులాల్లో మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. TGPSC కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం కూడా గురుకుల పాఠశాలలోనే చదివారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. విద్యార్థులకు పెట్టే ప్రతీ పైసా దేశ అభివృద్ధి కోసం పెట్టే పైసాగా భావించాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత విద్యార్థులకు డైట్ చార్జీలు పెంచలేదు. తమ ప్రభుత్వమే పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు అండగా నిలిచామని తెలిపారు.
మా ప్రభుత్వంలో స్కూల్ ప్రారంభమైన మొదటి రోజే పుస్తకాలు అందజేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులకు ఆరు నెలల తరువాత పుస్తకాలు ఇస్తే.. ఏం ప్రయోజనం అన్నారు. గురుకులాల్లో చదివిన ఓ విద్యార్థి చనిపోవడం చాలా బాధాకరం అని తెలిపారు. కాగా, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ, జనరల్ గురుకులాలన్నీ కలిపి సుమారు 1000 వరకు ఉన్నాయి. గురుకులాల్లో కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, పరిస్థితులను చక్కదిద్దేందుకు సన్నద్ధమైంది.
Read Also: Orange Cap In IPL: ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ గెలవని స్టార్ బ్యాటర్లు!