CM Jagan: ఈ నెల 14న సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటన

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 06:00 PM IST

CM Jagan: ఎన్నికల సమీపిస్తుండటంతో ఏపీ సీఎం జగన్ మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 14న సీఎం జగన్‌ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవ­రం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు వాయుమార్గంలో చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీకాకు­ళం జిల్లా మకరంపురం గ్రామానికి సీఎం చేరుకుంటారు.

ఉద్దానం కిడ్నీ సమస్య నివారణకు చేపట్టిన వైఎస్సార్‌ సుజలధార ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారం­భి­స్తారు. పలాస చేరుకుని వైఎస్సార్‌ కిడ్నీ రీసెర్చ్‌ హాస్పిటల్‌ను ప్రారంభించి, శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి పలాస రైల్వే గ్రౌండ్స్‌లో బహిరంగ సభకు హాజర­వుతారు. మరిన్ని జిల్లాల పర్యటనలు చేసే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.