Peddireddy Ramachandra Reddy : తిరుపతి లోక్‌సభ ప్రాంతీయ సమన్వయకర్తగా పెద్దిరెడ్డి

  • Written By:
  • Publish Date - March 9, 2024 / 11:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికలను టార్గెట్‌ చేసుకొని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే అధికార వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం జగన్‌ పార్టీలో కీలక మార్పలకు పూనుకున్నారు. కొందరు నాయకులను అసెంబ్లీలు దాటించి వేరే అసెంబీల్లో పోటీకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. తిరుపతి లోక్‌ సభ ప్రాంతీయ సమన్వయకర్తగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వైసీపీ అధిష్ఠానం నియమించింది. ఇప్పటికే ఆయన చిత్తూరు, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తగా ఉన్నారు. ఇదివరకు తిరుపతి ఇంచార్జీగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిని నెల్లూరు లోక్‌ సభ ఇన్ఛార్జ్ గా పార్టీ నియమించింది. దీంతో ఆ బాధ్యతలను పెద్దిరెడ్డికి అప్పగించారు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే తిరుపతి పార్లమెంట్ కోఆర్డినేటర్‌గా ఇప్పటివరకూ చెవిరెడ్డి ఉన్నారు. అయితే.. చెవిరెడ్డిని సీఎం జగన్ ఒంగోలు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే.. చెవిరెడ్డిని ఒంగోలు పార్లమెంట్ వైసీపీ ఇంఛార్జిగా జగన్‌ నియమించారు. అంతేకాకుండా.. ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని బరిలో దింపే అవకాశం ఉంది. అయితే.. తిరుపతి పార్లమెంట్ కోఆర్డినేటర్ పోస్ట్‌ను పెద్దిరెడ్డికి సీఎం జగన్‌ అప్పగించడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు సమాచారం.

తిరుపతి లోక్‌ సభ స్థానంతో పాటు.. తిరుపతి ఎమ్మెల్యే స్థానంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తారనే వార్తలు బయటకు వచ్చాయి. తిరుపతి సీటుపై జనసేన పట్టుతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడ పెట్టి వైసీపీని గెలిపించేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలో పోటీ చేస్తే.. టీడీపీ నాయకురాలు సుగుణమ్మ సైతం తప్పుకుంటానంటూ ప్రకటించారు. ఇలాంటి వార్తల మధ్యలోనే వైసీపీ చీఫ్‌ జగన్‌ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్తగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించడం కీలకంగా మారింది.

Read Also : YCP Leaders Distributing Gifts : ఏపీలో అప్పుడే పంపకాలు మొదలుపెట్టిన అధికార నేతలు..