Site icon HashtagU Telugu

CM Chandrababu : నేడు కూడా విజయవాడ కలెక్టరేట్లోనే సీఎం చంద్రబాబు..

Chandrababu (8)

Chandrababu (8)

CM Chandrababu Today Also In Vijayawada Collectorate : ఏపీలో వరద అపార నష్టాన్న కలిగించాయి. విజయవాడ ప్రాంత వాసులను వరదలు నిరాశ్రయులను చేశాయి వరదలు. అయితే.. ఇప్పటికే గత ఐదు రోజుల నుండి విజయవాడలోనే మకాం వేసిన సీఎం చంద్రబాబు తను 74 వయసును కూడా లెక్క చేయకుండా.. బాధితుల్లో ధైర్యం నింపేందుకు రాత్రిపగళ్లు కృషి చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు కూడా సీఎం చంద్రబాబు విజయవాడ కలెక్టరేట్‌లోనే ఉండనున్నారు. అయితే.. ఏపీలో ఇవాళ సాయంత్రంలోగా కేంద్ర ప్రభుత్వానికి ఏపీ వరదలపై ప్రాథమిక నివేదిక పంపించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బుడమేరు కాలువ గండి పూడ్చివేతలో సైన్యం సాయం తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇళ్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలు తెప్పిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్ణీత ధరలకే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్‌ల సేవలు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు, నేటి నుంచి నిత్యావసరాలతో పాటు కుటుంబానికి మూడు ప్యాకెట్ల నూడుల్స్, యాపిల్స్, పాలు పంపిణీ చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అలాగే, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబరు నెల విద్యుత్తు బిల్లుల వసూలు వాయిదా వేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.

AP Rains: కోస్తాంధ్రలో భారీ వర్షాలు, ఆరు లక్షల మంది ప్రభవితం

అయితే.. సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కుండపోత వర్షం, దాని ఫలితంగా ఏర్పడిన వరదలు, ముఖ్యంగా విజయవాడలో తన రాజకీయ జీవితంలో తాను ఎదుర్కొన్న “పెద్ద విపత్తు” అని నివేదించారు. “నా కెరీర్‌లో ఇది అతి పెద్ద డిజాస్టర్.. హుద్‌హుద్ తుపాను, తిత్లీ తుఫాన్ లాంటి కొన్ని సంఘటనలు ఎదుర్కొన్నాం కానీ వీటితో పోలిస్తే ఇక్కడ మనుషుల బాధలు, ఆస్తి నష్టం చాలా ఎక్కువ” అని విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు అన్నారు. NDRF బృందం, కేంద్ర బలగాలు, జిల్లా అధికారులతో కలిసి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, ఇతర నిత్యావసర వస్తువులను అందించారు.

ఇదిలా ఉంటే.. భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేయడంతో వివిధ వర్షాలకు సంబంధించిన సంఘటనలలో 16 మంది మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం ₹ 5,000 కోట్ల నష్టాన్ని అంచనా వేసింది, కేంద్రం నుండి ₹ 2,000 కోట్ల తక్షణ సాయం కోరింది. వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, బాధిత ప్రాంతాలను సందర్శించి, ప్రకటించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా పిలిచారు.

Aerial survey : బుడమేరులో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఏరియల్‌ సర్వే