ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రేపు తిరుమల(Tirumala)లో శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. మనవడు నారా దేవాన్ష్ (Nara Devansh Birthday) పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. ప్రతిసారి కీలక సందర్బాల్లో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే చంద్రబాబు, ఈసారి కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
Posani Bail Petition : ఆ రోజైన పోసానికి బెయిల్ వస్తుందో..?
తిరుమల శ్రీవారి దర్శనానంతరం, తరిగొండ వెంగమాంబ సత్రంలో నారా దేవాన్షీ పేరుతో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, అనుచరులు పాల్గొననున్నారని సమాచారం. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేసి, శ్రీవారి ఆశీర్వాదాలు తీసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Nandamuri Family Issue : నందమూరి ఫ్యామిలీ కోల్డ్ వార్ కు పురందేశ్వరి శుభం కార్డు వేయబోతుందా..?
అన్నదానం కార్యక్రమం పూర్తయిన అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల నుంచి నేరుగా హైదరాబాద్‌కు ప్రయాణం కానున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలుకేందుకు సిద్ధమవుతున్నారు. తిరుమల పర్యటనను పురస్కరించుకుని రాష్ట్రంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.