New Year Wishes: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు (New Year Wishes) తెలిపారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియాలో ఖాతాలో ట్వీట్ చేశారు. అలాగే మాజీ సీఎంలు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలు కూడా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోంది. కేవలం ఆరునెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలను ఆవిష్కృతం చేశాం. నిరుపేద భవిష్యత్‌కు భరోసా ఇస్తూ పింఛన్ల మొత్తాన్ని పెంచాం. ప్రతి ఇంటా కట్టెల పొయ్యి కష్టాలు తీరుస్తూ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ధాన్యం సేకరణ డబ్బులు 48 గంటల్లో చెల్లించి రైతన్నలో సంతోషాన్ని నింపాం. మీ ప్రయాణం సాఫీగా సాగాలని రాష్ట్రంలో రహదారులన్నీ గుంతలు లేకుండా చేస్తున్నాం. కొత్త ప్రభుత్వ పాలసీలతో మళ్లీ పెట్టుబడులు తెచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు నాంది పలికాం. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోంది. ‘స్వర్ణాంధ్ర-2047’ విజన్ సాకారమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ అటు ప్రజా సంక్షేమాన్ని, ఇటు రాష్ట్రాభివృద్ధిని మీ అందరి సహకారంతో చేసి చూపిస్తాం. మీ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు’’ అని రాసుకొచ్చారు.
Also Read: New Year : 2025కి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్
తెలుగు ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోంది. కేవలం ఆరునెలల్లోనే సంక్షేమం,… pic.twitter.com/78e8c6uT6Y
— N Chandrababu Naidu (@ncbn) December 31, 2024
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్, జగన్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాసుఖాలను, మంచిని సమానంగా స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. 2025లో ప్రతి కుటుంబం సుఖశాంతులతో వృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు.