ఇవాళ నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయలుదేరిన చంద్రబాబు .. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దర్శనం చేసుకుని జలహారతిలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం జల విద్యుత్పత్తి కేంద్రాన్ని సందర్శించనున్న సీఎం చంద్రబాబు. సుండిపెంట గ్రామంలో సాగు నీటి సంఘాల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి కానున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలోనే.. శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం గుండుమలలో చంద్రబాబు పర్యటిస్తారు. గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్నారు సీఎం చంద్రబాబు.. మధ్యాహ్నం 1.45 గంటలకి గుండుమల ప్రభుత్వ పాలిటెక్నీకల్ కళాశాల హెలిపాడ్ చేరుకొనున్న సీఎం.. 2:20 గంటలకు గుండుమలలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్దిదారులకు పంపిణీ చేస్తారు. మల్బరి ప్లాంటేషన్ షెడ్ ను సందర్శించి పట్టు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అలాగే మధ్యాహ్నం 3.20 గంటలకు గుండుమలలో కరియమ్మ దేవి దేవాలయన్ని సందర్శిస్తారు. అనంతరం 3.25 గంటల నుంచి 4:25 గంటల వరకు గ్రామ ప్రజలతో ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు.
అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. నల్లమల శ్రీశైలం అడవులను గ్రేహౌండ్స్, బాంబుస్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులు జల్లెడ పట్టారు. శ్రీశైలం ఆలయం, జలాశయం వద్ద ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా పరిశీలించారు.
అదేవిధంగా.. పిఠాపురంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ పాల్గొనున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఆనం వెంకటరెడ్డి నగర్ లో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పాల్గొననున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొననున్నారు. అనంతరం మంత్రి నారాయణ నగర పాలక సంస్థ కార్యాలయంలో జరిగే భవన నిర్మాణాల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం పై జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Weather Updates: రేపటి వరకు భారీ వర్షాలు.. అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..!