Site icon HashtagU Telugu

Delhi Accident: ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడి 16ఏళ్ళ బాలుడు మృతి

Delhi Accident

Delhi Accident

Delhi Accident: ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హర్ష్ విహార్ ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి 16 ఏళ్ల విద్యార్థి పడి మృతి చెందాడు. బాలుడు ఢిల్లీలోని మండోలి ఎక్స్‌టెన్షన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో విద్యార్థితో పాటు అతని స్నేహితులు కూడా ఉన్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఢిల్లీలోని వజీరాబాద్ రోడ్డులోని మండోలి జైలు సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడిని జిటిబి ఆసుపత్రికి తరలించగా అతను మార్గమధ్యంలోనే చనిపోయినట్లు వైద్యలు నిర్దారించారు. మృతుడు ఘజియాబాద్‌లోని గగన్ విహార్ నివాసిగా గుర్తించారు.

Also Read: CM Jagan : జగన్ ను యేసుక్రీస్తుగా పోలుస్తూ ప్లెక్సీలు