Nara Lokesh Birthday : నారా లోకేష్ కు మెగాస్టార్ విషెస్

Nara Lokesh Birthday : తెలుగుదేశం పార్టీ(TDP) యువనేతగా, తన ప్రత్యేకమైన నాయకత్వ శైలితో పార్టీకి, రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ

Published By: HashtagU Telugu Desk
Chiru Lokesh

Chiru Lokesh

తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన రాజకీయ నేత నారా లోకేష్ పుట్టినరోజు (Nara Lokesh Birthday) ఈరోజు. ఈ సందర్భంగా ఆయనకు అన్ని వైపులా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ(TDP) యువనేతగా, తన ప్రత్యేకమైన నాయకత్వ శైలితో పార్టీకి, రాష్ట్రానికి ఎంతో సేవ చేస్తూ ముందుకు సాగుతున్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టిన లోకేష్, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

IT Raids : సినీ నిర్మాతలు, డైరెక్టర్లపై మూడో రోజూ కొనసాగుతున్న ఐటీ రైడ్స్

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. లోకేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ”ప్రియమైన లోకేశ్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం. మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా” అని చిరంజీవి పేర్కొన్నారు.
ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక పుట్టినరోజు సందర్బంగా లోకేష్ తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, తన కుటుంబ సభ్యులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రత్యేకమైన కార్యక్రమాలతో ఈ వేడుకను మరింత ఆహ్లాదకరంగా మార్చారు. నారా లోకేష్ ఈ ఏడాది మరిన్ని విజయాలు సాధించి, తెలుగు ప్రజల అభివృద్ధికి మరింత కృషి చేయాలని అందరూ కోరుకుంటున్నారు.

  Last Updated: 23 Jan 2025, 10:26 AM IST