Site icon HashtagU Telugu

Chinese Spy Balloon: చైనా నిఘా బెలూన్ లో విషయంలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు?

Chinese Spy Balloon

Chinese Spy Balloon

ఈ సంవత్సరం ప్రారంభంలో అమెరికా గగనతనంలో వచ్చిన చైనా గూడ చర్య బెలూన్ తీవ్ర కలకలం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం కొద్దిరోజుల పాటు సంతులనంగా మారింది. కానీ అమెరికా పై నిఘా పెట్టేందుకే డ్రాగన్‌ దీనిని ప్రయోగించిందని అగ్రరాజ్యం తాజాగా తేల్చింది. ఇందుకోసం అమెరికా సాంకేతికతనే చైనా కూడా ఉపయోగించినట్లు బయటపడింది. ఈ మేరకు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో వెల్లడించింది. ఈ బెలూన్‌ను అమెరికా కూల్చివేసి శకలాలను సేకరించిన విషయం తెలిసిందే. వాటిపై ఆ దేశ రక్షణశాఖ, నిఘా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.

ఈ బెలూన్‌లో యూఎస్‌ గేర్‌తో పాటు ప్రత్యేకమైన చైనీస్‌ సెన్సార్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాంకేతికతతో అమెరికాలోని కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బీజింగ్‌కు బదిలీ చేయాలని ప్రయత్నించిందని అమెరికా విశ్వసనీయ వర్గాలు వెల్లడించింది. ఇది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్‌ కాదని అమెరికా పై నిఘా పెట్టాలనే ఉద్దేశంతోనే దీన్ని పంపించారని దర్యాప్తులో తేలినట్లు అధికారులు అంచనాకు వచ్చారు. ఈ బెలూన్‌ అలస్కా, కెనడాతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల గగనతలాల మీదుగా ఎనిమిది రోజుల పాటు ప్రయాణించింది.

అయితే, ఈ సమయంలో ఎలాంటి డేటాను ఈ బెలూన్‌ చైనాకు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించలేదని అధికారులు చెబుతున్నారు. ఈ దర్యాప్తు అంశాలపై అటు శ్వేతసౌధం గానీ ఇటు ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ గానీ స్పందించలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చైనాకు చెందిన ఒక భారీ బెలూన్‌ అమెరికాలోని పలు ప్రాంతాల్లో కనిపించింది . అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానాలో ఈ బెలూన్‌ కన్పించడంతో అమెరికా దీన్ని తీవ్రంగా పరిగణించింది. యుద్ధ విమానాన్ని ప్రయోగించి దీన్ని కూల్చివేసింది. ఈ ఘటన అప్పట్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.