China 41 Satellites : ఒకే రాకెట్ తో 41 శాటిలైట్ల ప్రయోగం.. చైనా మరో రికార్డ్

China 41 Satellites : చైనా మరో కొత్త రికార్డును సృష్టించింది. ఒకే రాకెట్ తో 41 శాటిలైట్లను ప్రయోగించి, కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 

  • Written By:
  • Publish Date - June 16, 2023 / 12:32 PM IST

China 41 Satellites : చైనా మరో కొత్త రికార్డును సృష్టించింది.

ఒకే రాకెట్ తో 41  శాటిలైట్లను ప్రయోగించి, కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.   

లాంగ్ మార్చ్-2డి రాకెట్‌  ద్వారా ఈ శాటిలైట్లను ప్రయోగించింది. 

దీంతో ఒకే టైంలో.. ఒకే రాకెట్ తో .. అత్యధిక సంఖ్యలో ఉపగ్రహాలను ప్రయోగించిన దేశంగా చైనా సరికొత్త రికార్డును నెలకొల్పింది. 

ఉత్తర చైనాలోని తైయువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్‌లో ఈ ప్రయోగం జరిగింది. లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్‌తో నిర్వహించిన 476వ ప్రయోగం ఇది. ఈసారి ప్రయోగించిన 41 శాటిలైట్లలో 36.. జిలిన్-1 మోడల్ శాటిలైట్లే. ఈ 36 శాటిలైట్లను ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న వాణిజ్య ఉపగ్రహ తయారీ సంస్థ చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ కో అభివృద్ధి చేసింది. అందుకే వాటికి “జిలిన్-1” అనే పేరు వచ్చింది.

Also read : Target China : చైనా నగరాలన్నీ టార్గెట్ గా భారత్ మిస్సైల్స్

దేశంలోని భూ వనరులు, ఖనిజాల అన్వేషణ, స్మార్ట్ సిటీ నిర్మాణ రంగాల అవసరాల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల నెట్ వర్క్ అభివృద్ధిపై చైనా ఫోకస్ పెట్టింది. ఇందుకోసం 100 కంటే ఎక్కువ జిలిన్-1 రకం రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను ప్రయోగించాలని టార్గెట్ గా పెట్టుకుంది.  ఇందులో భాగంగానే ఇప్పుడు  జిలిన్-1 మోడల్ కు చెందిన 36 శాటిలైట్లను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. సాధ్యమైనంత త్వరగా ఈ కక్ష్యలోని జిలిన్-1 శాటిలైట్ల సంఖ్యను 100 దాటించే ప్లాన్ లో చైనా ఉంది. మొదటి జిలిన్-1 శాటిలైట్ ను 2015 అక్టోబర్ లో ప్రయోగించారు. అప్పట్లో ఈ ఉపగ్రహం బరువు 420 కిలోగ్రాములు. ఇప్పుడు దాని బరువు 22 కిలోగ్రాములు.