Site icon HashtagU Telugu

China-Myanmar :చైనా టార్గెట్ లో వైజాగ్, చెన్నై.. మయన్మార్ లో మిలిటరీ బేస్

China Myanmar

China Myanmar

China-Myanmar : మయన్మార్‌ ఆర్మీ చైనాతో చేతులు కలిపింది.

మయన్మార్‌కు కుడివైపున బంగాళాఖాతంలో ఉన్న కోకో ద్వీపాన్ని చైనాకు అప్పగించింది. 

అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు డ్రాగన్ కు పర్మిషన్ ఇచ్చింది. 

దీనిపై ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఎందుకంటే కోకో ద్వీపం నుంచి భారత్ లోని చెన్నై, వైజాగ్, కోల్ కతా, బాలాసోర్ తీర ప్రాంతాలను చైనా ఈజీగా టార్గెట్ చేయగలుగుతుంది.

కోల్ కతా, చెన్నై, బాలాసోర్, వైజాగ్ లపై గురి 

చైనా లోన్ ట్రాప్ చాలా డేంజరస్ గా ఉంటుంది. మయన్మార్ కూడా ఇందులో ఇరుక్కుంది. 2021లో మయన్మార్ లో ఆర్మీ తిరుగుబాటు చేసి ఆంగ్ సాన్ సూకీని జైలులో వేసింది. సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఆధ్వర్యంలో మయన్మార్‌ లో సైనిక పాలన మొదలైంది.  దీన్ని పాశ్చాత్య దేశాలు వ్యతిరేకించాయి. మయన్మార్ ను(China-Myanmar) ఒంటరి చేశాయి. అయితే ఈ అవకాశాన్ని చైనా సద్వినియోగం చేసుకుంది. మయన్మార్‌కు గత 2 ఏళ్లలో దాదాపు రూ.32వేల కోట్ల లోన్ ఇచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా  చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ బెల్ట్ రోడ్  కారిడార్ నిర్మాణానికి సహకరించాలనే షరతు పెట్టింది. భారత్ లోని  కోల్ కతా, చెన్నై, బాలాసోర్, వైజాగ్ తీర ప్రాంతాలకు చేరువగా ఉండే బంగాళాఖాతంలోని  కోకో ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసే ఛాన్స్ ఇవ్వమని  మయన్మార్‌  సైనిక పాలకులను చైనా కోరింది. ఇప్పటికే కోకో ద్వీపంలో విమాన సౌకర్యం కోసం చైనా రన్‌వే నిర్మించిందని ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది.  ఈ ద్వీపంలో దాదాపు 1500 మంది చైనా సైనిక సిబ్బంది కోసం కొత్త షెడ్‌లు, బ్యారక్‌లు నిర్మించారని సమాచారం.

Also read : China 41 Satellites : ఒకే రాకెట్ తో 41 శాటిలైట్ల ప్రయోగం.. చైనా మరో రికార్డ్

భారత్ ఆందోళనకు కారణాలు ఇవీ.. 

కోకో ద్వీపం.. ఇండియా బార్డర్  

కోకో ద్వీపం అనేది బంగాళాఖాతంలో ఉన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది మయన్మార్ (బర్మా) అధికార పరిధిలో ఉంది. ఇది బంగాళాఖాతం, అండమాన్ సముద్రం సరిహద్దులో ఉంది. భారతదేశంలోని అండమాన్, నికోబార్ దీవులకు ఉత్తరాన ఇది ఉంది. పరిపాలనాపరంగా ఇది బర్మాలోని యాంగోన్ డివిజన్‌లో భాగం. కోకో ద్వీపం ఉత్తర అండమాన్ ద్వీపం నుంచి కేవలం 20 కి.మీలో దూరంలో ఉంది.

Exit mobile version