Site icon HashtagU Telugu

Hyderabad: హైదరాబాద్ లో తల్లిదండ్రుల నిర్లక్ష్యం

Hyderabad

New Web Story Copy 2023 07 31t132504.091

Hyderabad: తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా పిల్లలు బలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి అలా అని అతిగారాబం పనికిరాదు. తెలంగాణాలో భారీ వర్షాల కారణంగా రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇక హైదరాబాద్ పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. కొద్దిపాటి వర్షానికే రోడ్లపై నీరు చేరుతుంది. ఎక్కడ డ్రైనేజీ తెరిచి ఉంటుందో తెలియని పరిస్థితి. రోడ్లు ధ్వంసం అవుతాయి. దీని కారణంగా ప్రయాణికులు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. హైదరాబాద్ లోని రసూల్ పురాలో కారు డిక్కీ ఓపెన్ చేసి వెనుక భాగంలో పిల్లల్ని కూర్చోబెట్టి తల్లిదండ్రులు ముందుభాగంలో కూర్చున్నారు. తాజాగా తెలంగాణ డిజిపి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫోటో చూస్తుంటేనే ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఉంది. ఏ చిన్న ప్రమాదం జరిగిన చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. దీనిపై డిజిపి ఆందోళన చెందారు. తల్లిదండ్రులు ఇంత బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు అని, అమాయక పిల్లలకు భద్రత మరియు క్రమశిక్షణ గురించి చెప్పేది ఇదేనా అంటూ ప్రశ్నించారు. మొదటి విద్యా పాఠాలు ఇంట్లోనే ప్రారంభమవుతాయి. కొంతమంది తల్లిదండ్రులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. మీ పిల్లలకు మంచి విలువలను అందించాలని కోరుతున్నానని డీజీపీ పేర్కొన్నారు.

Also Read: Siberian Birds: అతిధులు వచ్చేశాయ్.. కనువిందు చేస్తున్న సైబీరియన్‌ పక్షులు