ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కరెగుట్ట అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్(Encounter )లో 38 మంది మావోయిస్టులు మృతి(28 Maoists killed)చెందారు. భద్రతా దళాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో ఎదురైన కాల్పుల్లో మావోయిస్టులు బలయ్యారు. ఈ ఘటన ములుగు మరియు సుక్మా జిల్లాల సరిహద్దులో చోటుచేసుకుంది. సమాచారం మేరకు మృతుల్లో పలువురు కీలక మావోయిస్టు నేతలు ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Jadeja: బీసీసీఐ కొత్త నియమం.. జడేజాకు ఝలక్ ఇచ్చిన అంపైర్!
“ఆపరేషన్ కరెగుట్ట” అనే పేరుతో భద్రతా బలగాలు గత కొన్నిరోజులుగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో మావోయిస్టుల గూళ్లపై దాడులు నిర్వహించి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపధ్యంలోనే మావోయిస్టులు భద్రతా బలగాలకు ఎదురు దాడులు చేపట్టగా ఘర్షణ తలెత్తింది. ఎదురుకాల్పులు గంటల తరబడి కొనసాగినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై మావోయిస్టుల శిబిరం నుంచి స్పందన కూడా వచ్చినట్టు సమాచారం. భద్రతా బలగాలు తమ కూంబింగ్ ఆపరేషన్‌ను నిలిపివేయాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే భద్రతా బలగాలు మాత్రం కీలక నేతల్ని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ సంఘటనతో నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రత మరింత కట్టుదిట్టంగా మారింది.