Congress Govt Survives : ఛత్తీస్‌గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా సీఎం భూపేష్ బాఘేల్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షాలు శుక్రవారం అర్ధరాత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో తిరస్కరణకు గురైంది. బీజేపీ తన అవిశ్వాస తీర్మానంలో సీఎం భూపేష్ బాఘేల్ ప్రభుత్వంపై 109 ఆరోపణలు చేసింది. ఈ తీర్మానంపై అసెంబ్లీలో 13 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటకు వాయిస్ ఓటింగ్ చేపట్టారు. మొత్తం 90 మంది ఎమ్మెల్యేలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ 72 మంది ఎమ్మెల్యేలతో మెజారిటీని నిరూపించుకోవడంతో .. విపక్షాల అవిశ్వాస తీర్మానం(Congress Govt Survives) వీగిపోయింది. బీజేపీకి 13 మంది శాసనసభ్యులు ఉన్నారు.
Also read : Monsoon Pregnancy: గర్భిణులు బీ అలర్ట్.. వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..!
అనంతరం అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. అసెంబ్లీ కార్యకలాపాలను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే అవిశ్వాస తీర్మానంలోని 109 ఆరోపణలపై అసెంబ్లీలో సీఎం భూపేష్ బాఘేల్ బదులివ్వడం ప్రారంభించగానే బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లిపోయారు. వాస్తవానికి జులై 18 నుంచి జూలై 21 వరకు అసెంబ్లీ కార్యక్రమాలు జరిగాయి. సమావేశాల చివరి రోజైన శుక్రవారం విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. అవిశ్వాస తీర్మానంతో శుక్రవారం అర్థరాత్రి అసెంబ్లీ సెషన్ ముగిసింది. కాగా, సీఎం భూపేష్ బాఘేల్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ఇది రెండోసారి.
Also read : Varun Tej & Lavanya: వరుణ్–లావణ్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్, మెగా పెళ్లి సందడి షురూ!
సీఎం భూపేష్ బాఘేల్ ఏమన్నారంటే..
“ప్రజాస్వామ్యంలో అవిశ్వాసం పెట్టే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అధికార పార్టీకి కూడా తన సర్కారును నిలబెట్టుకునే అవకాశం ఉంది. బీజేపీ మా సర్కారుపై చేసిన 109 ఆరోపణలు కూడా అవాస్తవాలే. గతంలో అవిశ్వాస తీర్మానం వస్తే ముందుగా నక్సల్స్ సమస్యపైనే చర్చ జరిగేది. ఈసారి సభ్యులు దాని గురించి మాట్లాడలేదు. ఇది మా ఘనత” అని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు.