Site icon HashtagU Telugu

ANM Training Course: ANM ట్రైనింగ్ కోర్స్‌ ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆహ్వానం

Anm Training Course

Anm Training Course

ANM Training Course: 2023-24 సంవత్సరానికి గాను ఏఎన్‌ఎం ట్రైనింగ్ కోర్సులో మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను తెలంగాణ కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆహ్వానించింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు మరియు రిజిస్ట్రేషన్ రుసుము రూ.200 చెల్లించడానికి చివరి అక్టోబర్ 20. ఈ రుసుము డిడి రూపంలో ఏదైనా జాతీయ బ్యాంకు ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియ అక్టోబర్ 31 నాటికి పూర్తవుతుంది. తరగతులు నవంబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతాయి.

మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు సంబంధిత ప్రిన్సిపాల్, ప్రభుత్వ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (MPHFW) శిక్షణా సంస్థలు/ ప్రాంతీయ శిక్షణా కేంద్రాలు/ జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులు (DM&HO), మరియు ప్రైవేట్ శిక్షణా పాఠశాలలను సంప్రదించవచ్చు. వివరాలకు: http://chfw.telangana.gov.in వెబ్ సైట్ ని సందర్శించవచ్చు.

Also Read: ODI World Cup: ప్లేయింగ్ ఎలెవన్ లో మార్పులు.. ఆఫ్ఘన్ తో ఆడే భారత్ తుది జట్టు ఇదే..!