Gold- Silver: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు తగ్గాయి.

  • Written By:
  • Updated On - November 7, 2023 / 07:29 AM IST

Gold- Silver: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు తగ్గాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,350గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,470గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.78,200కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (నవంబర్ 07, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: NTR : వార్ 2 కి ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చేశాడా.. తారక్ సెట్స్ లో అప్పుడే వస్తాడా..?

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,620గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,000 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,180గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,470 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,470గా ఉంది.

We’re now on WhatsApp : Click to Join

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,200 ఉండగా, ముంబైలో రూ.75,200గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.78,200 ఉండగా, కోల్‌కతాలో రూ.75,200గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000 ఉండగా, కేరళలో రూ.78,200గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,200 ఉండగా, విజయవాడలో రూ.78,200 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.