Latest Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Latest Rates) నేడు వరసగా మూడో రోజు తగ్గాయి.

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 07:30 AM IST

Latest Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Latest Rates) నేడు వరసగా మూడో రోజు తగ్గాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,900గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,890గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.77,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (సెప్టెంబర్ 08, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: PM Modi Host Dinner: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు ప్రధాని మోదీ ప్రత్యేక విందు..!

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,040గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,200 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,230గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,900 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.59,890 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,890గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,890గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,000 ఉండగా, ముంబైలో రూ.74,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, కోల్‌కతాలో రూ.74,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.73,000 ఉండగా, కేరళలో రూ.77,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,500 ఉండగా, విజయవాడలో రూ.77,500 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.