Gold Rates: నేడు బంగారం, వెండి కొనాలని చూస్తున్నారా.. నేటి ధరలు ఇవే..!

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా పెరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Gold Price Records

Gold Rate

Gold Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,220గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.80,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక ఆదివారం (సెప్టెంబర్ 03, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Fuel Rates: నేడు స్థిరంగా ఇంధన ధరలు.. పెట్రోల్, డీజిల్ ధర ఎంతంటే..?

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,370గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,490గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,220 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,220గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,220గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,900 ఉండగా, ముంబైలో రూ.76,900గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, కోల్‌కతాలో రూ.76,900గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,300 ఉండగా, కేరళలో రూ.80,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000 ఉండగా, విజయవాడలో రూ.80,000 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

  Last Updated: 03 Sep 2023, 07:58 AM IST