Site icon HashtagU Telugu

Chandrayaan – 3 : చంద్రుడికి మరింత చేరువగా చంద్రయాన్‌-3

Chandrayaan 3's Most Critical Part

Chandrayaan 3's Most Critical Part

బెంగళూరు : చంద్రయాన్‌-3 (Chandrayaan – 3)కి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కొత్త అప్ డేట్ ను ప్రకటించింది. చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్ మరో ప్రదక్షిణను పూర్తి చేసి.. చంద్రుడికి మరింత దగ్గరగా చేరుకుందని బుధవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. చంద్రుడి ఉపరితలానికి దగ్గరలోనే స్పేస్ క్రాఫ్ట్ తిరుగుతోందని తెలిపింది. బుధవారం ఉదయం చంద్రయాన్‌-3 (Chandrayaan – 3) స్పేస్ క్రాఫ్ట్ కక్ష్యను 174 కి.మీ x 1437 కి.మీకు తగ్గించినట్లు పేర్కొంది. తదుపరిగా ఆగస్టు 14న ఉదయం 11.30 నుంచి 12.30 మధ్యలో కక్ష్యలో మార్పులు చేస్తామని చెప్పింది. ఆ మార్పుల తర్వాత.. ఆగస్టు 16న చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి స్పేస్ క్రాఫ్ట్ చేరుకుంటుందని ఇస్రో వివరించింది. ఆ మరునాడే (ఆగస్టు 17న) స్పేస్ క్రాఫ్ట్ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడిపోతుందని తెలిపింది. ఈక్రమంలో స్పేస్ క్రాఫ్ట్ వేగం గంటకు 6000 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. ల్యాండింగ్‌ మాడ్యూల్‌ లో ల్యాండర్‌ (విక్రమ్‌), రోవర్‌ (ప్రగ్యాన్‌) ఉంటాయని, ఇది ల్యాండ్ అయ్యేటప్పుడు గంటకు 10 కిలోమీటర్ల వేగం ఉంటుందని చెప్పింది. ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు రోవర్‌ తో కూడిన ల్యాండర్‌ చంద్రుడిపై ల్యాండింగ్‌ అవుతుందని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read:  Minister Roja : ఇండస్ట్రీ పెద్దగా తమ్ముడికి బుద్ధి చెప్పాల్సింది పోయి రాజకీయాలు మాట్లాడతారా.. చిరంజీవి వ్యాఖ్యలపై రోజా కౌంటర్..