టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం (Skill Development Scam )లో అరెస్ట్ కావడం…ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారింది. 73 ఏళ్ల వయసులో చంద్రబాబు అరెస్ట్ కావడం..ఈ స్కామ్ లో ఆయనఫై వచ్చిన ఆరోపణలు రుజువైతే కనీసం పదేళ్ల పాటు శిక్ష పడుతుందని చెపుతుండడం తో అందరిలో ఖంగారు మొదలైంది. ఇటు కుటుంబ సభ్యులు , టీడీపీ శ్రేణులు , కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా మనకు ఏదైనా చెడు జరిగితే వెంటనే మన జాతకం ఎలా ఉంది..? ఇంకా ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి..? ఆర్ధికంగా ఎలా ఉండబోతుంది..? అనేవి మనం చూసుకుంటుంటాం.
Read Also : Chandrababu Arrest Case: అసలు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఏంటి..? దానికి చంద్రబాబు కు సంబంధం ఏంటి..?
ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కూడా అలాగే అంత చూడడం (Chandrababu horoscope) చేస్తున్నారు. మరో మూడు , నాల్గు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి టీడీపీ అధికారం లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్ట్ కావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉంది..? 2024 లో సీఎం అవుతారా..? లేక జైలు కే పరిమితం అవుతారా..? అనేవి చూద్దాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎం గా చంద్రబాబు అధికారం చేపట్టారు. సీఎం గా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు..అలాగే ప్రస్తుత ఏపీ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో జయపజయాలను చూసారు. అంతే కాదు నక్సలైట్ దాడిలో చావు అంచుల వరకు కూడా వెళ్లొచ్చారు. కాగా 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం వైసీపీ చేతిలో ఓటమి చెంది..ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ప్రస్తుత శోభకృత్ నామ సంవత్సరంలో ఆయన జాతకం ఎలా ఉందంటే..
ఈ సంవత్సరంలో అత్యంత అనుకూలమైన ఫలితాలు కలిగిన రాశి కన్యారాశి. చంద్రబాబు 1951 ఏఫ్రిల్ 20న నారావారిపల్లెలో జన్మించారు. చైత్ర శుద్ధ త్రైయోదశి శుక్రవారం జన్మించిన చంద్రబాబుది కూడా కన్యారాశి. అలానే వీరు హస్త నక్షత్రంలో జన్మించారు. చంద్రబాబు జాతకంలో ఈ ఏడాది కొన్ని యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజయోగాలు.. అందులోనూ అద్వితీయమైనటువంటి యోగాలు చంద్రబాబుకు కలగనున్నాయి. గురుడి స్థానాన్ని బట్టి హంసయోగం, రవి-బుధుడు కలిసి ఉండటం బుదాదిత్య యోగం, ప్రత్యేకించి 1, ,4, 7,10 స్థానాల్లో చంద్రుడు- గురుడు ఉన్నట్లు అయితే దానిని గజకేశరి యోగం అంటారు.
Read Also : Chandrababu Arrest – YCP Happy : చంద్రబాబు అరెస్ట్ ..సంబరాల్లో వైసీపీ
చంద్రబాబు జాతకంలో గజకేశరి అనే ప్రధానమైన యోగం ఉంది. దీని కనీసం వందేళ్లు లేదా వెయ్యేళ్లు మనం చేసినటువంటి పనిని గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. 2024 మే నెలకు శుక్రుడి అంతదశ అత్యంత అనుకూలంగా ఉంది. అలానే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు, తీవ్రమైనటువంటి ఇబ్బందికి, అరిష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. అధికారంలో భాగస్వామి అయ్యే అవకాశం చంద్రబాబుకు ఉంది.
ఈ సంవత్సరం ప్రథమార్థం నుంచి కూడా తన శ్రేణులను ఉత్సాహా పరుస్తుంటారు. ఈ ఏడాది నుంచి చంద్రబాబు పాత సిద్ధాంతలను పక్కన పెట్టి.. కొత్త వ్యూహాలతో ముందడుగు వేస్తారు” అని పండితులు చెప్పుకొచ్చారు. తీవ్రమైనటువంటి ఇబ్బందికి గురి అవుతారని చెప్పడం బట్టి చూస్తే..అది ఇప్పుడు స్కామ్ కేసులో అరెస్ట్ కావడమే అని తెలుస్తుంది. అయితే ఈ కేసు నుండి ఆయన బయటపడతారా..? లేదా అనేది చూడాలి. విధి రాసిన రాతను ఎవరు మార్చలేరు కదా,,మరి చంద్రబాబు కు ఎలా ఉందొ చూడాలి.
Read Also : Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు పై పవన్ ఫైర్..
ప్రస్తుతం మాత్రం చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రజలు ఆగ్రహపు జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. ఓ పెద్దయ్యాను అరెస్ట్ చేయడం ఏంటి..? ప్రజలు ఎంత సేవ చేసారు..? చంద్రబాబు ఒక్కడే అవినీతికి పాల్పడ్డాడా..? సొంతవాళ్లను చంపినవారే దర్జాగా బయట తిరుగుతున్నారు..అలాంటిది డబ్బులు కొట్టేశారని జైల్లో పెడతారా అంటూ టీడీపీ కార్య కర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.