Site icon HashtagU Telugu

AP : రాజకీయ కక్ష్యతోనే చంద్రబాబును అరెస్ట్ చేసారు – బండి సంజయ్

Chandrababu Arrested With T

Chandrababu Arrested With T

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ అనేది రాజకీయ కక్ష్య సాధింపు చర్యే అన్నారు. కరీంనగర్‌(Karimnagar)లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. చంద్రబాబు అరెస్ట్ చేయడం వల్ల వైసీపీ(YCP)కే చాలా మైనస్ అవుతుందన్నారు. నేరం చేస్తే ఎవరినైనా ఆరెస్ట్ ఎవరూ కాదనరని..అయితే ఎఫ్‌ఐఆర్‌(FIR)లో పేరు లేని వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏమిటో అర్ధం కావడం లేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం కక్ష పూరితంగా ఆయన్ని అరెస్ట్ చేయడం వల్ల ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ అరెస్ట్‌తో చంద్రబాబుకు మైలేజ్‌ పెరుగుతుందని..వైసీపీకి మైనస్ అవుతుందని అన్నారు. వైసీపీ తన గోతిలో తనే పడిందని, ఆంధ్రాలో వైసీపీకి దరిద్రపు అలవాటు ఉందని.. నిజం మాట్లాడితే చంద్రబాబు ఏజెంట్ అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలేమైనా సుద్ద పూసలా..అని ప్రశ్నించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశం నిర్వహించిన జి20 సమావేశాల సమయంలోనే చంద్రబాబు ను అరెస్టు చేయడానికి ఏపీ పోలీసులకు సమయం కుదిరిందా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.

Read Also : AP : నారా భువనేశ్వరిని, బ్రాహ్మణిలను పరామర్శించిన పవన్ కళ్యాణ్