AP Bandh : రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చే ఆలోచనలో టీడీపీ..

చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 07:39 AM IST

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చంద్రబాబు ను అరెస్ట్ చేయబోతున్నారనే వార్త తెలిసిన దగ్గరి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

శుక్రవారం నంద్యాలలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళాశక్తి పథకాలను వివరించేందుకు మహిళలతో మాట్లాడారు. సాయంత్రానికి బహిరంగ సభలో ప్రసంగించారు. అనంతరం చంద్రబాబు స్థానికంగా ఉండే RK ఫంక్షన్ హాల్‌లో రెస్ట్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో ఫంక్షన్ హల్ వద్ద మోహరించిన పోలీసులు దాదాపు నాల్గు గంటల సేపు హడావిడి చేసి..ఉదయం 5;30 గంటల ప్రాంతంలో DIG రఘురాం రెడ్డి..చంద్రబాబు తో మాట్లాడి..ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల ఇచ్చిన FIR కాపీని న్యాయవాదులు, చంద్రబాబు పరిశీలించారు. సిఆర్పిసి సెక్షన్ 50(1) నోటీస్ సర్వ్ చేశారు. ఇది సిఐడి డిఎస్పీ ధనుంజయుడు పేరు మీద వచ్చింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు బాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 ఎండ్‌ 37 ఏపీసీ సెక్షన్‌ల కింద చంద్రబాబు ఫై కేసులు నమోదు చేశారు.

Read Also : CBN Arrest – A Conspiracy : విజయవాడకు చంద్రబాబు తరలింపు.. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో ముందుగానే హెలికాప్టర్ ?

చంద్రబాబు అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలనే ఆలోచనలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటూ…గృహ నిర్బంధం చేస్తున్నారు. నంద్యాల లో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. పోలీసులు ఎన్ని చేసిన ప్రజలు ఆగే ప్రసక్తి లేదని..పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చి చంద్రబాబు కు మద్దతు పలుకుతారని అంటున్నారు. విజయవాడ తో పాటు పలు ముఖ్య నగరాల్లో పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు రోడ్ల పైకి వస్తున్నారు. సామాన్య ప్రజలు సైతం ఏంజరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు.