Mobile Apps: అనుమానిత యాప్ లను బ్లాక్ చేసిన కేంద్రం

అనుమానిత మొబైల్ అప్లికేషన్స్ పై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు యాప్ లను ప్లే స్టోర్ నుండి రిమూవ్ చేసింది. దేశ భద్రతకు ముప్పు కల్పించే ఎలాంటి యాప్ లను అయినా కేంద్రం వదిలిపెట్టట్లేదు.

Mobile Apps: అనుమానిత మొబైల్ అప్లికేషన్స్ పై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు యాప్ లను ప్లే స్టోర్ నుండి రిమూవ్ చేసింది. దేశ భద్రతకు ముప్పు కల్పించే ఎలాంటి యాప్ లను అయినా కేంద్రం వదిలిపెట్టట్లేదు. ఈ సందర్భంగా పలు అనుమానిత యాప్ లను కేంద్రం గుర్తించింది.

పాకిస్థాన్ యాప్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఐబి సమాచారంతో పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేయబడిన 14 మెసెంజర్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి సమాచారం అందుకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు చెందిన 14 మొబైల్ మెసెంజర్ అప్లికేషన్‌లను బ్లాక్ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదాన్ని పెద్ద ఎత్తున వ్యాప్తి చేయడానికి ఈ యాప్‌లను ఉపయోగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ అప్లికేషన్‌లను కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు తమ మద్దతుదారుతో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించారు. దీనికి సంబంధించి ఓ ఇంటెలిజెన్స్ అధికారి మాట్లాడుతూ… అండర్ గ్రౌండ్ లో ఉన్న వ్యక్తులు మరియు ఉగ్రవాదులు పరస్పరం కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించే ఛానెల్‌లపై ఏజెన్సీలు నిఘా ఉంచుతాయి. వారి కాల్ డేటా ట్రాక్ చేస్తాయి. అయితే మొబైల్ అప్లికేషన్‌ ను ట్రాక్ చేయడం కష్టంగా ఉందని ఏజెన్సీలు కనుగొన్నాయి.

ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సహాయంతో అనుమానిత యాప్‌ల జాబితాను తయారు చేశారు. సదరు యాప్ లు భారత చట్టాలకు లోబడి లేవు. ఈ నేపథ్యంలో ఈ మొబైల్ యాప్‌లను నిషేధించాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69A కింద ఈ యాప్‌లను బ్లాక్ చేసినట్లు అధికారి తెలిపారు.

తొలగించబడ్డ యాప్ లలో క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్ స్విస్, వికర్మే, మీడియాఫైర్, బ్రియార్, బీచాట్, నాండ్‌బాక్స్, కోనియన్, ఐఎంఓ, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా ఉన్నాయి.

Read More: 22 Snakes Caught: మహిళ బ్యాగ్ లో 22 పాములు.. వీడియో వైరల్