Smart phone : స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

  • Written By:
  • Updated On - May 15, 2024 / 02:01 PM IST

Indian Computer: ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలోని లోపాల (ఫ్లాస్‌) కారణంగా మీ ఫోన్‌ హ్యాకింగ్‌ కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీఫోన్‌ ను తమ కంట్రోల్‌ లోకి తీసుకోవచ్చని, ఫోన్‌ లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే అవకాశం ఉందని చెప్పింది. దీనిని అడ్డుకోవడానికి ఇండియన్‌ స్మార్ట్ ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అప్‌ డేట్‌ వెర్షన్‌ ను రిలీజ్‌ చేసినట్లు తెలిపింది. వెంటనే మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ను అప్ డేట్‌ చేసుకోవాలిని సూచించింది.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలో చాలావరకు స్మార్ట్ ఫోన్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోనే పని చేస్తున్నాయని సీఈఆర్టీ‌‌– ఇన్ పేర్కొంది. ఇప్పటికీ పాత వెర్షన్ లోనే ఉన్న స్మార్ట్ ఫోన్లలోకి హ్యాకర్లు సులభంగా ప్రవేశిస్తారని, యూజర్ కు తెలియకుండానే అందులోని విలువైన సమాచారాన్ని తస్కరిస్తారని చెప్పింది. ఫొటోలు, యూపీఐ వివరాలు, ఇతరత్రా సమాచారం దొంగిలించవచ్చని వివరించింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని పలు లోపాలను తాజాగా గుర్తించినట్లు తెలిపింది. ఇవి ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీకి ముప్పుగా పరిణమిస్తాయని చెప్పింది. అంతేకాదు, హానికరమైన సాఫ్ట్ వేర్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది.

Read Also: CM Yogi Adityanath: ఎయిమ్స్‌లో చేరిన సీఎం యోగి ఆదిత్యనాథ్ తల్లి

ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14.. ఈ వెర్షన్లు వాడుతున్న స్మార్ట్ ఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, లేటెస్ట్ వెర్షన్ తో ఫోన్ ను అప్ డేట్ చేసుకోవాలని సీఈఆర్టీ– ఇన్ సూచించింది.

Follow us