Site icon HashtagU Telugu

Alert: ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగొచ్చు.. అప్రమత్తంగా ఉండండి.

Template (61) Copy

Template (61) Copy

దేశంలో ఉగ్రకదలికలు పెరుగుతున్న వేళ నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. నిన్న పంజాబ్ లో జరిగిన లుథియానా బాంబ్ బ్లాస్ట్ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులకు అసలు నిజాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. పంజాబ్ లో ఎన్నికలు రానుండటంతో మరిన్ని బాంబ్ దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ఇంటలిజెన్స్ బ్యూరో ఎప్పటికప్పుడు భద్రతా దళాలలను హెచ్చరిస్తూ వస్తోంది. కశ్మీర్ కేంద్రం కంట్రోల్ లో ఉండటంతో ఉగ్రవాదుల దృష్టి ఇప్పుడు పంజాబ్ మీద పడిందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే ఖలిస్థాన్ తీవ్రవాదానికి మళ్లీ తిరిగి జీవం పోయడానికి ఈ ఉగ్రసంస్థలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర నిఘా వర్గాలతో పంజాబ్ పోలీసులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. సోషల్ మీడియా పై నిఘ పెంచారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పంజాబ్ లో ఎలాంటి దాడులు జరగకుండా ఉండేందుకు అన్ని చెక్ పోస్టులను అలెర్ట్ చేశారు.