Site icon HashtagU Telugu

CBSE Board Results: విద్యార్థుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. సీబీఎస్ఈ రిజ‌ల్ట్స్ ఎప్పుడంటే..?

CBSE Guidelines

CBSE Guidelines

CBSE Board Results: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE Board Results) మే మొదటి వారంలో హైస్కూల్, ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయవచ్చు. CBSE బోర్డు పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cbse.nic.inని సందర్శించడం ద్వారా వారి స్కోర్‌కార్డ్‌ను తనిఖీ చేసుకోవ‌చ్చు. ఫలితాలను తనిఖీ చేయడానికి మీ రోల్ నంబర్, పాఠశాల నంబర్, అడ్మిట్ కార్డ్ నంబ‌ర్ ఉప‌యోగించాల్సి ఉంటుంది. దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. వారు ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ కాకుండా మీరు SMS, IVRS, DigiLocker, Google ద్వారా మీ రిపోర్ట్ కార్డ్‌ని తెలుసుకోవ‌చ్చు.

అయితే ఇప్పటివరకు 10వ, 12వ త‌ర‌గతుల బోర్డు ఫలితాల విడుదలకు సంబంధించిన అధికారిక తేదీ, సమయాన్ని సీబీఎస్ఈ అధికార యంత్రాంగం ప్రకటించలేదు. కానీ స‌మాచారం ప్రకారం మే మొదటి వారంలోనే రిజ‌ల్ట్స్‌ వెలువడనున్నాయి.

We’re now on WhatsApp : Click to Join

ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు స్కోర్ కార్డులో ముద్రించిన సమాచారాన్ని ఒకసారి జాగ్రత్తగా చదవాలి. ఏదైనా పొరపాటు జరిగితే దాన్ని సరిదిద్దడానికి మీరు పాఠశాల అధికారాన్ని సంప్రదించవచ్చు. మీ రిపోర్ట్ కార్డ్‌లో మీ పేరు, రోల్ నంబర్, తల్లి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, సబ్జెక్ట్ పేరు, సబ్జెక్ట్ కోడ్, థియరీ మార్కులు, ప్రాక్టికల్ మార్కులు, మీరు ఉత్తీర్ణులైన లేదా ఫెయిల్ అయిన తుది ఫలితం అన్నీ ఉంటాయి.

Also Read: Income Tax Return: ఫారం- 16 అంటే ఏమిటి? ఇది లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయ‌లేమా..?

సీబీఎస్ఈ ఫలితాలు 2024ని ఎలా తనిఖీ చేయాలి

– ముందుగా CBSE cbse.nic.in, cbse.gov.in అధికారిక వెబ్‌సైట్‌లకు వెళ్లండి.
-హోమ్‌పేజీకి వెళ్లి CBSE 10వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్ 2024/CBSE 12వ త‌ర‌గ‌తి 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
– మీ రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ IDని నమోదు చేయండి.
– CBSE బోర్డు ఫలితాలు 2024 మీ స్క్రీన్‌పై క‌నిపిస్తాయి.
– ఇప్పుడు మీరు మీ ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.