CBI Steps In : రంగంలోకి సీబీఐ.. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు 

CBI Steps In : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. "నిర్లక్ష్యం కారణంగా మరణం, ప్రాణహాని" అభియోగాలతో రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసును సీబీఐ ఈరోజు (మంగళవారం) టేకప్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Cbi Steps In

Cbi Steps In

CBI Steps In : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేయడానికి సీబీఐ రంగంలోకి దిగింది. “నిర్లక్ష్యం కారణంగా మరణం, ప్రాణహాని” అభియోగాలతో రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసును సీబీఐ ఈరోజు (మంగళవారం) టేకప్ చేసింది. “నిర్లక్ష్యం కారణంగా మరణం, ప్రాణహాని” అభియోగాలను బలపరిచే ఆధారాల సేకరణపై సీబీఐ ఇన్వెస్టిగేషన్ టీమ్(CBI Steps In) ఫోకస్  చేయనుంది. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టం లో టాంపరింగ్ జరగడం వల్లే .. గత శుక్రవారం రాత్రి 7 గంటలకు  గూడ్స్ రైలు పార్క్ చేసి ఉన్న లూప్ లైన్ లోకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కు  గ్రీన్ సిగ్నల్ వచ్చిందనే వాదన వినిపిస్తోంది. ఇందులో నిజమెంత ? అనేది కూడా సీబీఐ నిగ్గు తేల్చనుంది.

Also read : Virender Sehwag: సెల్యూట్ సెహ్వాగ్, ఒడిశా ప్రమాదంలో అనాథైన పిల్లలకు ఉచిత విద్య!

ఈక్రమంలో రైలు ప్రమాదం జరిగిన బహనాగ రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బందిని కూడా విచారించనున్నారు.  ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టంతో ముడిపడిన సాంకేతిక పరికరాల పనితీరును కూడా పరీక్షించే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో కుట్ర కోణం ఉందనే మరో వాదన పై కూడా సీబీఐ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈక్రమంలో ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు వరకు బహనాగ రైల్వే స్టేషన్ పరిసరాలలో రికార్డ్ అయినా సీసీ టీవీ ఫుటేజీని కూడా నిశితంగా చెక్ చేయనున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టం రాంగ్ సిగ్నల్ ఇచ్చేలా అందులో మార్పులు చేసినవారు ఎవరు అనేది ఈ కేసులో అత్యంత కీలక అంశంగా మారనుంది.

  Last Updated: 06 Jun 2023, 12:14 PM IST