Cancer: గుడ్ న్యూస్..క్యాన్సర్ ను నిరోధించే ఔషదం..ట్రయల్స్ లో వందశాతం ఫలితాలు..!!

క్యాన్సర్ ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి. ఇది మానవుడి పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. దేహంలో ఏ అవయవాన్నాయినా నాశనం చేసి మనిషి మరణానికి దారితీస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Cancer Killing Virus

Cancer Killing Virus

క్యాన్సర్ ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి. ఇది మానవుడి పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. దేహంలో ఏ అవయవాన్నాయినా నాశనం చేసి మనిషి మరణానికి దారితీస్తుంది. అయితే దీన్ని ఓ దశ వరకు మాత్రమే నయం చేసే అవకాశం ఉంటుంది. అయితే న్యూయార్క్ లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తాజాగా నిర్వహించిన డ్రగ్ ట్రయల్స్ క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి.

పురీష నాళ క్యాన్సర్ తో బాధపడుతున్న 18మందిపై స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు డోస్టార్లిమాబ్ అనే ఔషధాన్ని ప్రయోగించారు. వారికి 6 నెలల పాటు ఈ ఔషధాన్ని ఇచ్చారు. ట్రయల్స్ ముగిసేసరికి అందరికీ ఆశ్చర్యం కలిగేలా ఆ 18 మంది రోగుల్లో క్యాన్సర్ కణజాలం మాయమైంది.

కాగా ఆ రోగులు గతంలో క్యాన్సర్ చికిత్స భాగంగా కీమోథెరపీ, రేడియేషన్ శస్త్రచికిత్సలతో తీవ్రమైన వేదనను అనుభవించారు. వారిలో కొందరికి తీవ్రస్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చి ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఇలాంటి వారందరి పైనా డోస్టార్లిమాబ్ ఔషధం ప్రయోగించగా…ఆరు నెలల తర్వాత వారిలో క్యాన్సర్ కనిపించలేదు. తర్వాత చికిత్సలు అవసరంలేదని వారంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.

డోస్టార్లిమాబ్ ఔషధం ల్యాబ్ లో రూపొందించిన అణువులు ఉంటాయి. మానవదేహంలోకి ప్రవేశించి యాంటీబాడీలకు నకళ్లుగా పనిచేస్తాయి. క్యాన్సర్ కణాలను నివారిస్తాయి. ఈ ఔషధం వాడిన తర్వాత 18 మంది రోగుల్లో ఎండోస్కోపీ, పీఈటీ స్కానింగ్స్, ఎమ్మారై స్కానింగ్స్ నిర్వహించారు. వాటన్నింటిలోనూ క్యాన్సర్ లేదని ఫలితాలు వెలువడ్డాయి. దీంతో పరిశోధకులు సంతోషంలో మునిగిపోయారు.

  Last Updated: 07 Jun 2022, 05:21 PM IST