Site icon HashtagU Telugu

All About FIR : ఎఫ్‌ఐఆర్ లేకుండా అరెస్టు చేయొచ్చా? చంద్రబాబు విషయంలో ఏం జరిగింది?

Can Arrest Be Made Without Fir What Happened To Chandrababu

Can Arrest Be Made Without Fir What Happened To Chandrababu

All About FIR : ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో టీడీపీ చీఫ్ చంద్రబాబుతో పోలీసులు అరాచకంగా వ్యవహరించారు. కనీసం ఎఫ్‌ఐఆర్ కానీ.. అరెస్ట్ వారెంట్ కానీ లేకుండానే ఆయనను అరెస్టు చేశారు. చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కుంభకోణం జరిగిందంటూ నమోదైన ఓ కేసులో ఈ అరెస్టు జరిగింది. ఈనేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ (FIR) లేకుండా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందా ? ఉండదా? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది. దీనికి న్యాయ నిపుణులు చెబుతున్న సమాధానం ఇలా ఉంది. “ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేదా వారెంట్ లేకుండానే పోలీసులు అరెస్టు చేయవచ్చు.

ఇందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 41 అనుమతిస్తుంది” అని అంటున్నారు. అయితే షరతులు వర్తిస్తాయి. ఆ షరతులను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రవర్తించారని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎఫ్‌ఐఆర్ (FIR) లేకుండా అరెస్టులు చేసే క్రమంలో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని లీగల్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

చంద్రబాబు అరెస్టులో చట్టానికి తూట్లు..

* పోలీసుల ఎదుటే దారుణమైన , హింసాత్మక నేరానికి పాల్పడే వారిని ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. కానీ చంద్రబాబు ప్రజానేత. ఆయన సమాజ సంస్కరణ కోసం కృషి చేస్తున్నారు.

* ఎవరిపై అయినా సహేతుకమైన ఫిర్యాదులు వస్తే .. ఆ ఫిర్యాదుల ఆధారాలపై విశ్వసనీయ సమాచారం ఉంటే పోలీసులు
ఎఫ్‌ఐఆర్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. కానీ చంద్రబాబు విషయంలో పోలీసులు ప్రైమా ఫేసీని కానీ, ప్రాథమిక ఆధారాలను కానీ చూపలేకపోయారు. దీనిపై పోలీసులను చంద్రబాబు ప్రశ్నించినా.. ఆన్సర్ చెప్పకుండానే అదుపులోకి తీసుకున్నారు.

* నిందితుడు ఏదైనా నేరం చేశాడని నిరూపించేందుకు దోహదం చేసే నమ్మదగిన ఆధారాలు లేదా సమాచారం ఉంటే పోలీసులు
ఎఫ్‌ఐఆర్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. కానీ ఆధారాలను పోలీసులు బహిర్గతంగా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు దేశంలోని ప్రతి పౌరుడికి ఉందని చెప్పారు.

*అరెస్ట్ అవసరం అని పోలీసులు భావిస్తే.. ఎఫ్‌ఐఆర్ లేకుండానే నిందితుడిని అరెస్ట్ చేయొచ్చు. అయితే చంద్రబాబు నిత్యం రాష్ట్రంలోనే ప్రజల మధ్య ఉండే వ్యక్తి. అలా అందుబాటులో ఉండే వ్యక్తిని రాత్రికి రాత్రి అరెస్టు చేయడం పోలీసుల ఓవర్ యాక్షన్ అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

*తదుపరి నేరాన్ని నిరోధించడానికి ఎఫ్‌ఐఆర్ లేకుండానే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయొచ్చు. చంద్రబాబుపై నమోదైన ఒక్క నేరాభియోగానికి కూడా పోలీసులు ఇప్పటిదాకా ఆధారాలను బయటపెట్టలేదు. అలాంటిది..తదుపరి నేరం అనే విషయమే చంద్రబాబుకు వర్తించదు.

* సరైన విచారణ కోసం నిందితుడిని ఎఫ్‌ఐఆర్ లేకుండానే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. చంద్రబాబు విషయంలో అరెస్టు చేయడమే సక్రమంగా జరగలేదు. అన్యాయంగా రాత్రికి రాత్రి 73 ఏళ్ల చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

* సాక్ష్యాలను తారుమారు చేయకుండా నిరోధించడానికిగానూ నిందితుడిని పోలీసులు ఎఫ్‌ఐఆర్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. పోలీసులు ఇప్పటివరకు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలను చూపలేక పోయారు. ఇక సాక్ష్యాలను చంద్రబాబు తారుమారు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది ?

* సాక్షికి ముప్పు వంటివి నిరోధించడానికి పోలీసులు ఎఫ్‌ఐఆర్ లేకుండానే నిందితుడిని అరెస్ట్ చేయొచ్చు. చంద్రబాబు సుదీర్ఘ పొలిటికల్ కెరీర్ లో ఎవరితోనూ ఘర్షణకు దిగిన దాఖలాలు లేనే లేవు. అటువంటి క్లీన్ చిట్ కలిగిన నాయకుడు.. సాక్షులను ముప్పు తలపెడతారు అనే ఆలోచన కూడా సరికాదు.

Also Read:  Chandrababu Arrest: వైసీపీ అరాచక పాలనకు పరాకాష్ట.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది చీకటి రోజు, చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తున్న రాజకీయ ప్రముఖులు..!