PM Vishwakarma Scheme- 1 Lakh Loan : చేతివృత్తుల వారికి రూ. లక్ష లోన్.. పీఎం విశ్వకర్మ స్కీంను ప్రకటించిన కేంద్రం

PM Vishwakarma Scheme- 1 Lakh Loan : ఆగస్టు 15 వేళ  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోట నుంచి విశ్వకర్మ పథకాన్నిప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

  • Written By:
  • Updated On - August 16, 2023 / 04:10 PM IST

PM Vishwakarma Scheme- 1 Lakh Loan : ఆగస్టు 15 వేళ  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎర్రకోట నుంచి విశ్వకర్మ పథకాన్నిప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ పథకానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీని ద్వారా చేతివృత్తుల వారికి రాయితీపై రూ. లక్ష దాకా లోన్స్ ఇస్తామని వెల్లడించింది. ఈ పథకం అమలు కోసం రూ.13వేల కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా చేతివృత్తులు చేసుకునే దాదాపు 30 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతాయని అంచనా వేస్తున్నారు.

Also read : Krishna Janmabhoomi : 100 ఇళ్లు కూల్చివేత..  శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలో బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు స్టే

100 పట్టణాల్లో 10వేల ఈ-బస్సులు.. 

దేశంలోని పట్టణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం ఈ-బస్‌ సేవ’ పథకాన్ని(PM Vishwakarma Scheme- 1 Lakh Loan) ప్రకటించింది. దీనికి కూడా కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ఈ పథకం కింద దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 100 పట్టణాల్లో 10వేల ఈ-బస్సులను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.  ఈ బస్సుల కొనుగోలుకు రూ.57,613 కోట్లను వెచ్చించనున్నట్లు తెలిపింది.