Site icon HashtagU Telugu

Telangana Elections 2023: ఎన్నికల వేళ నగరంలో బస్ స్టాప్‌లు కిక్కిరిసిపోయాయి

Telangana Elections 2023

Telangana Elections 2023

Telangana Elections 2023: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి . హైదరాబాద్‌లో నివసించే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇళ్లకు వెళ్తున్నారు. ఓటు వేసేందుకు కుటుంబ సమేతంగా ఇళ్లకు బయల్దేరడంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. కోఠిలోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్, ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్‌బి నగర్ జంక్షన్ మరియు ఆరామ్‌ఘర్‌లో వాహనాల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులను నడుపుతున్నామని టీఎస్‌ఆర్టీసీ అధికారులు చెబుతున్నా బస్సుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు.

Also Read: Nehru Zoological Park: రేపు నెహ్రూ జూలాజికల్ పార్కు బంద్